AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragya Jaiswal: లాక్‌డౌన్‌ జీవితంపై ప్రగ్యా జైస్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు .. జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిందంటూ వేదాంతం

Pragya Jaiswal: కరోనా మహమ్మారి యావత్‌ మానవాళిని ఒక కుదుపు కుదిపిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు అన్ని రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. సెలబ్రిటీలు...

Pragya Jaiswal: లాక్‌డౌన్‌ జీవితంపై ప్రగ్యా జైస్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు .. జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిందంటూ వేదాంతం
Pragya
Narender Vaitla
|

Updated on: Jul 27, 2021 | 3:45 PM

Share

Pragya Jaiswal: కరోనా మహమ్మారి యావత్‌ మానవాళిని ఒక కుదుపు కుదిపిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు అన్ని రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా బారిన పడి ఆరోగ్యాన్ని గుల్లు చేసుకున్న వారు కొందరైతే.. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమై మానసికంగా ఇబ్బందులు పడ్డ వారు మరికొందరు. అయితే కొందరు మాత్రం అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరుచుకున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపే సినీ తారలు లాక్‌డౌన్‌ సమయంలో కొత్త కొత్త విషయాలను నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. గతంలో కొందరు తారలు ఈ విషయాలను ఇంటర్వ్యూల్లో తెలిపారు. తాజాగా అందాల తార ప్రగ్యాజైస్వాల్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.

లాక్‌డౌన్‌ సమయంలో తాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ ఖాళీ సమయంలో ఏం చేశారన్న దానిపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా తన ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చిన ప్రగ్యా.. వృత్తిపరమైన కోరికలను పక్కనబెట్టి వర్తమానంలో ఎలా జీవించాలో నేర్చుకున్నాను అని తెలిపారు. ఇక తనలోని శక్తి సామార్థ్యాల్ని బేరీజు వేసుకునే అవకాశం లభించిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ కారణంగా మనకు ఏది ముఖ్యమో విశ్లేషించుకునే అరుదైన అవకాశం దొరికిందని, వర్కవుట్స్‌ మీద పూర్తిగా దృష్టిపెట్టడంతో సానుకూల దృక్పథం అలవాటైందని చెప్పారు. ఇప్పుడు తాను గతంలో కంటే సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన చూస్తుంటే ప్రపంచాన్ని అతలాకుతంల చేసిన కరోనా ప్రగ్యాకు మాత్రం మరో జీవితాన్ని అందించినట్లు అనిపిస్తోంది కదూ. ఇక ఈ అందాల భామ కెరీర్‌ విషయానికొస్తే ‘కంచె’ చిత్రంతో తెలుగులో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది అనంతరం పలు సినిమాల్లో నటించి మొప్పించారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘అఖండ’తో పాటు బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు.

Also Read: Rajeev Kanakala: సుమతో విభేదాల రూమర్స్‏కు చెక్ పెట్టిన రాజీవ్ కనకాల.. నిజంగానే విడిగా ఉండాల్సి వచ్చిందంటూ..

Yashika Anand: ఓ వైపు యాషికా ఆనంద్‌కు రెండు ఆపరేషన్ల నిర్వహణ.. మరోవైపు డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసు నమోదు

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..