RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'ఆర్ఆర్ఆర్'.

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Rrr Movie
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 27, 2021 | 12:16 PM

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్షన‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్, లహరి మ్యూజిక్ దక్కించుకోగా.. శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ మరో కీలక అప్‌డేట్‌ను ప్రకటించారు. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఫస్ట్ సింగిల్‌ను ఆగష్టు 1వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘దోస్తీ’ అనే పేరుతో సాగనున్న ఈ పాట ఐదు భాషల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు సింగర్లతో దీనిని రిలీజ్ చేయనున్నారట. ఈ పాటను తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా.. కీరవాణీ మ్యూజిక్ అందించారు. హేమచంద్ర పాడారు. కాగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‏, మేకింగ్ వీడియో, టీజర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో తెలుగుతో పాటు తమిళ, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. 2021 అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!

ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

 మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!

పాకిస్థాన్‌లో పుట్టాడు.. టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.. అరంగేట్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు!