Viral Video: ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

దెయ్యలపై చర్చ ఇప్పటిది కాదు.. కొంతమంది దెయ్యాలు ఉన్నాయని వాదిస్తే.. మరికొందరు అవన్నీ కట్టుకధలే అని కొట్టిపారేస్తుంటారు. ఇక...

Viral Video: ఇంటి చుట్టూ తిరిగిన 'దెయ్యం నీడ'.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..
Ghost
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 26, 2021 | 4:39 PM

దెయ్యలపై చర్చ ఇప్పటిది కాదు.. కొంతమంది దెయ్యాలు ఉన్నాయని వాదిస్తే.. మరికొందరు అవన్నీ కట్టుకధలే అని కొట్టిపారేస్తుంటారు. ఇక ఇంటర్నెట్‌లో అయితే దెయ్యాలపై లెక్కలేనన్ని వీడియోలు దొరుకుతాయి. ఇదంతా పక్కనబెడితే.. ఈ మధ్యకాలంలో సీసీటీవీ కెమెరాల్లో పలు వింత వింత ఆకారాలు, సంఘటనలు రికార్డు అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి స్కాట్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది. ఓ నల్లటి నీడ అకస్మాత్తుగా ప్రత్యక్షమై.. ఇంటి బయట ఉన్న కారవాన్‌లోకి దూరడం.. ఆ ఇంటి యజమానిని భయభ్రాంతులకు గురి చేసింది. దానికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్కాట్‌ల్యాండ్‌లోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా వీడియోలు చూసి ఖంగుతింది. ఓ నల్లటి నీడలాంటి ఆకారం గాల్లో ఎగురుకుంటూ అక్కడే గార్డన్‌లో పార్క్ చేసిన కారవాన్‌లోకి దూరటం కనిపించింది. ఈ విజువల్స్ అన్నీ కూడా సీసీటీవీలో రికార్డు కావడంతో.. వాటిని చూసిన మాక్సిన్‌ ఒక్కసారిగా షాకై.. మతాధికారిని ఆశ్రయించింది.

అయితే ఆమె ఇంటి చుట్టూ వింత వింత ఆకారాలు తిరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి నల్లటి ఆకారాలను చూసినట్లుగా మాక్సిన్ చెప్పింది. కాగా, తన పిల్లలు గార్డెన్‌లో అడుకునేటప్పుడు.. వారి చుట్టూ ఆ నీడ తిరిగేదని.. ప్రతీ రోజూ కనిపిస్తోందని మాక్సిన్ వివరించింది. మాక్సిన్ సోదరి నిక్కి ముల్హెరాన్ ఆ రికార్డింగ్‌ను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో