పాకిస్థాన్‌లో పుట్టాడు.. టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.. అరంగేట్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు!
అతడు దిగ్గజ ఆల్‌రౌండర్. టీమిండియా తరపున కేవలం 33 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ప్రత్యర్ధులను తన పదునైన బంతులతో..
అతడు దిగ్గజ ఆల్‌రౌండర్. టీమిండియా తరపున కేవలం 33 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ప్రత్యర్ధులను తన పదునైన బంతులతో బెంబేలెత్తించాడు. తన కెరీర్‌లో 255 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఆల్‌రౌండర్ అరంగేట్రం మాత్రం కొంచెం భిన్నంగా జరిగింది. ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన ఇతగాడు.. మొదటి రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌట్ అయ్యాడు. దాదాపు అతడి కెరీర్ ముగిసిందని భావించాడు. అతడెవరో కాదు జి.ఎస్. రాంచంద్. ఇవాళ ఈ దిగ్గజ క్రికెటర్ పుట్టినరోజు.
1927 జూలై 26న కరాచీలో జన్మించిన జి.ఎస్.రాంచంద్ టీమిండియా తరపున 33 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్ జట్టుపై తన కెరీర్‌ను ప్రారంభించిన రాంచంద్.. మొదటి రెండు ఇన్నింగ్స్‌లలో డకౌట్‌గా వెనుదిరిగాడు. 1952లో లీడ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులు చేసింది. ఇందులో విజయ్ మంజ్రేకర్ 133 పరుగులు చేయగా, కెప్టెన్ విజయ్ హజారే 89 పరుగులు చేశాడు. అయితే రాంచంద్ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జిమ్ లేకర్ నాలుగు వికెట్లు పడగొట్టగా, ఫ్రెడ్ ట్రూమాన్ మూడు వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌట్ అయింది. టామ్ గ్రావెనీ 71, గాడ్‌ఫ్రే ఎవాన్స్ 66, అలాన్ వాట్కిన్స్ 48 పరుగులు చేశారు. భారత బౌలర్లలో గులాం అహ్మద్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ రాంచంద్ డకౌట్..
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా చతికిలబడింది. మొత్తంగా 165 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఇద్దరు అర్ధ సెంచరీలు సాధించినప్పటికీ.. ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవలేదు. అటు రాంచంద్ కూడా మరోసారి డకౌట్ అయ్యాడు. ఈసారి ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెడ్ ట్రూమాన్, రోలీ జెంకిన్స్ చెరో నాలుగేసి వికెట్లు పడగొట్టారు. ఇక టార్గెట్‌ను ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి చేధించడంతో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
16 సెంచరీలు, 255 వికెట్లు..
భారత క్రికెట్ జట్టు తరపున ఆల్‌రౌండర్‌గా 33 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జిఎస్ రామ్‌చంద్.. 24.58 సగటుతో 1180 పరుగులు చేశాడు. ఇక రాంచంద్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 145 మ్యాచ్‌లు ఆడి.. 36.30 సగటుతో 6026 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అలాగే 255 వికెట్లు పడగొట్టాడు