Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Theaters: తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరల పై హైకోర్టులో విచారణ..

కరోనా ప్రభావం సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యూపెన్సీతో తెరచుకున్న థియేటర్స్ పై కోవిడ్

TS Theaters: తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరల పై హైకోర్టులో విచారణ..
Ts Teaters
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 27, 2021 | 3:32 PM

కరోనా ప్రభావం సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యూపెన్సీతో తెరచుకున్న థియేటర్స్ పై కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఆర్థికంగా నష్టపరిచింది. దీంతో థియేటర్స్ మూత పడిన సంగతి తెలిసిందే. ఇక క్రమంగా కరోనా కేసులు తగ్గుపట్టిన నేపథ్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో జూలై 30 నుంచి థియేటర్లలో బొమ్మ పడబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే థియేటర్లు ఓపెన్ చేసినా.. ప్రేక్షకులు వస్తారనే నమ్మకం మాత్రం అటు నిర్మాతలకు.. ఇటు థియేటర్స్ యాజమానులకు కలగడం లేదు. దీంతో రోజుకీ నాలుగు ఆటలతోపాటు.. టికేట్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు ఈరోజు (జూలై 27)న విచారణ జరిపింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది న్యాయస్థానం. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశించింది. అంతేకాకుండా.. ఇదే విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోం శాఖ సెక్రెటరీలను హైకోర్టు ఆదేశించింది.

Also Read: Rajeev Kanakala: సుమతో విభేదాల రూమర్స్‏కు చెక్ పెట్టిన రాజీవ్ కనకాల.. నిజంగానే విడిగా ఉండాల్సి వచ్చిందంటూ..

Raj kundra: రాజ్ కుంద్రా కంపెనీపై గుజరాత్ షాప్ కీపర్ చీటింగ్ కేసు.. రూ. 3 లక్షలు నొక్కేశాడట !

green india challenge:మరో మైలురాయిని సాధించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్..మొక్కలు నాటిన పద్మవిభూషణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్.

Yashika Anand: ఓ వైపు యాషికా ఆనంద్‌కు రెండు ఆపరేషన్ల నిర్వహణ.. మరోవైపు డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసు నమోదు