Karthika Deepam Serial: విషం తాగిన దీప.. పిచ్చెక్కిన మోనిత..నోరు విప్పిన కార్తీక్.. సూపర్ సీన్!

కార్తీకదీపం..ప్రతిరోజూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్. ఇంటిల్లిపాదీ ఆసక్తిగా చూస్తున్న సీరియల్. కుటుంబ బంధాలు.. మంచీ,చెడుల మధ్య ఉండే సన్నని గీతలు.. అనుబంధాల మధ్యలో అపార్ధాలు.. అన్నిటినీ కలగలిపి బిగి సడలని కథనంతో ముందుకు సాగుతోంది కార్తీకదీపం.

Karthika Deepam Serial: విషం తాగిన దీప.. పిచ్చెక్కిన మోనిత..నోరు విప్పిన కార్తీక్.. సూపర్ సీన్!
Karthika Deepam Serial
KVD Varma

|

Jul 27, 2021 | 7:28 AM

Karthika Deepam Serial:  కార్తీకదీపం..ప్రతిరోజూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్. ఇంటిల్లిపాదీ ఆసక్తిగా చూస్తున్న సీరియల్. కుటుంబ బంధాలు.. మంచీ,చెడుల మధ్య ఉండే సన్నని గీతలు.. అనుబంధాల మధ్యలో అపార్ధాలు.. అన్నిటినీ కలగలిపి బిగి సడలని కథనంతో ముందుకు సాగుతోంది కార్తీకదీపం. కుటుంబ సమేతంగా చూడదగ్గ అతి కొద్దీ కార్యక్రమాల్లో ఒకటిగా కార్తీకదీపం విజయయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ 1101 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. అయినా.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని ప్రేక్షకాదరణతో కార్తీకదీపం ప్రసారం అవుతోంది.

నిన్నటి ఎపిసోడ్(1101) లో జరిగింది ఇదీ..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆనందరావును చూడటానికి వస్తుంది మోనిత. అక్కడే ఉన్న దీప ఆమెను అడ్డుకుంటుంది. ఈలోపు అక్కడ ఉన్న నర్స్ మోనితను పలకరించి.. ఆనందరావు కార్తీక్ పై కోపంగా ఉన్న విషయాన్ని చెబుతుంది. దీంతో అవకాశం చిక్కిన మోనిత దీపను అవమానించేలా మాట్లాడుతూ.. నర్స్ తో కార్తీక్ కి తనకు పెళ్లి జరగబోతున్నట్టు చెబుతుంది. నర్స్ వెళ్ళిపోయిన వెంటనే దీప మోనితను బయటకు వెళ్లిపొమ్మని చెబుతుంది. ఈ ఆసుపత్రి మాది.. నువ్వు బయటకు వెళ్లకపోతే స్టాఫ్ తో బయటకు గెంటించాల్సి వస్తుంది అని వార్ణింగ్ ఇస్తుంది. అలాగే.. మోనిత పెళ్లిచేసుకుంటాను అని చెబుతూన్న 25వ తేదీకి అంజి వస్తాడు.. తనకి పెటాకులు చేస్తాడు అంటూ చెబుతుంది దీప. దీంతో మోనిత ఏమీ చేయలేక బయటకు వెళ్ళిపోతుంది. తరువాత దీప డీఎస్పీ ఇంటికి వెళుతుంది. ఆమె మొదట దీపతో కఠినంగా మాట్లాడినా.. తరువాత ఆమె కన్విన్స్ అయ్యేలా దీప మాట్లాడడంతో మెత్త పడుతుంది. దీప తాను ఒకటి చెబుతాను అని అడిగితే చెప్పమని అంటుంది. డీఎస్పీకి తన పథకాన్ని వివరిస్తుంది. దీప. దానికి సహాయం చేయడానికి డీస్పీ ఒప్పుకుంటుంది.

ఇదిలా ఉంటే.. దీప ఇచ్చిన షాక్ తో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన మోనిత కార్లో వెళుతూ తీవ్రంగా ఆలోచిస్తుంది. అసలు దీప ఏమిటీ ఇంత ధైర్యంగా ఉంది? అంజిగాడి పేరుచెప్పి పదే పదే నాకు అడ్డుతగులుతోంది. ఎదో వంటలక్క దానికి ఏమి తెలివితేటలు  ఉంటాయి అనుకుంటే.. నన్నే బెదిరించేస్తోంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? అనుకుంటూ కంగారు పడుతుంది. అసలు అంజి గాడు ఎక్కడున్నాడు? అని తనని తానే ప్రశ్నించుకుని..ఎవరికో ఫోన్ చేస్తుంది. అంజిగాడిని జాగ్రత్తగా చూడండి. వాడిని ఎక్కడికీ వెళ్లకుండా చూసుకోండి అని చెబుతుంది. అయితే, అవతల వాళ్ళు అంజి వైజాగ్ లో కనపడటం లేదని చెబుతారు. దీంతో మోనితకు మతిపోయినంత పని అవుతుంది.

ఇదీ సోమవారం నాటి ఎపిసోడ్ (1101)లో జరిగిన కథ.. దీప డీస్పీకి చెప్పిన ప్లాన్ ఏమిటి? ఆ ప్లాన్ అమలు చేశారా? అంజి అసలు ఎక్కడున్నట్టు? దీపకు అంజి దొరుకుతాడా? మోనిత అంజిని ఏమైనా చేస్తుందా? ఆనందరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు  ప్రసారం అయ్యే ఎపిసోడ్ (1102)లో ఏం జరగబోతోందోతెలుసుకుందాం..

మనకి సవతి తల్లి లేదు.. థాంక్ గాడ్!

ఇంట్లో పిల్లలకు భోజనం పెడుతుంటుంది. సౌర్య దీపతో ”అమ్మా నాన్నకి భోజనం ఎవరు పెడతారు.” అని అడుగుతుంది. అమ్మమ్మ నాన్నకి భోజనం తీసుకువెళ్లి పెడుతుంది. దీంతో పిల్లలు అమ్మకి అమ్మమ్మ సొంత అమ్మ కాదు. అందుకే సరిగా చూసేది కాదు. అలాంటి అమ్మను సవతి అమ్మ అంటారట. వాళ్ళు పిల్లలను బాగా చూసుకోరట అని సౌర్య హిమకు చెబుతుంది. దాంతో హిమ థాంక్ గాడ్. మనకు ఆ పరిస్థితి లేదు. మనకు అమ్మ ఉంది. అంటుంది. దీంతో దీప బాధపడుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ నా పిల్లలకు నాకు మధ్యలో ఇంకోరిని రానివ్వను అనుకుంటుంది. పిల్లలు ఇంకా ఆ విషయంపై మాట్లాడుకుంటుంటే వారిస్తుంది. నేను ఉన్నా, లేకపోయినా మీకు అటువంటి పరిస్థితి రానీయను. మీరు ఇటువంటి పెద్ద మాటలు మాట్లాడవద్దు అంటూ బాధగా చెబుతుంది. ఆమె బాద పడటం చూసిన పిల్లలు సరే.. అమ్మా నువ్వు బాధపడకు అంటారు.

మోనిత ఇదంతా చేసింది..

ఆసుపత్రిలో ఆదిత్య..కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్యా.. స్టంట్ వేస్తె జాగ్రత్తగా ఉండాలట కదా అని ఆదిత్య కార్తీక్ ను అడుగుతాడు. స్టంట్ అనికాదు.. ఒక్కసారి గుండె జబ్బు వస్తే జీవితాంతం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎటువంటి పరిస్థితిలోనూ షాక్ కలిగించే విషయాలు వారికి తెలియనివ్వకూడదు. అని చెబుతాడు. కానీ, ఇప్పుడు నా విషయమే పెద్ద సమస్యగా మారిపోయింది. సరే.. రేపు డాడీని డిశ్చార్జ్ చేస్తే దగ్గరుండి ఇంటికి తీసుకుని వెళ్ళు అని ఆదిత్యకు కార్తీక్ చెబుతాడు. అదేంటి అన్నయ్యా నువ్వు రావా? అని అడుగుతాడు ఆదిత్య. లేదు. నాన్న నన్ను చూస్తే ఇంకా బాధపడతాడు. అసలు ఇదంతా మోనిత చేసింది అని అంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా భాగ్యం కేరేజీ తీసుకుని వస్తుంది. భోజనం చేయండి బాబూ అని వారిని పిలులుస్తుంది.

విషం తాగిన దీప..

ఇక మరోవైపు మోనిత ఇంట్లో పిచ్చి పట్టినదానిలా అటూ ఇటూ తిరుగుతుంటుంది.. అంజి కనపడని విషయం.. దీప తనకు వార్ణింగ్ ఇచ్చిన విషయం గుర్తు తెచ్చుకుని టెన్షన్ అయిపోతూ ఉంటుంది. చాలా పిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది. దీంతో ఆమెను చూసిన ప్రియమణి భయపడి బయటకు వెళుతుంది. ఆసుపత్రిలో ఆదిత్యకు భోజనం పెడుతుంటుంది. కార్తీక్ ఏదో ఫైల్ చూస్తుంటాడు. ఈ లోపు అక్కడకు మోనిత కేరేజి పట్టుకుని వచ్చి భాగ్యం ను వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో భాగ్యం.. మీరిద్దరూ బయటకు వెళ్ళండి బాబూ అంటుంది. కార్తీక్ ఎందుకు అని అడుగుతాడు. దానికి భాగ్యం.. ఇప్పుడు నేను దీన్ని కేరేజీ పెట్టి కొడితే దాని మొహం క్యాబేజీలా పగిలిపోతుంది. అది మీరు చూడలేరు కదా అంటుంది. దీంతో మోనిత తలుపు దగ్గరకు వెళ్లి గడియ పెట్టి.. నువ్వెందు కార్తీక్ నేనే పెడతాను. ఇక్కడ ఈవిడ గారు ఎదో రక్తపాతం సృష్టిస్తుందట కదా… దానిని మీ ఆసుపత్రి స్టాఫ్ చూస్తే బావుండదు కదా.. అంటుంది. తరువాత.. భాగ్యం దగ్గరకు వచ్చి.. నన్ను నా కార్తీక్ ఎలానూ కొట్టడు.. నాకు తెలుసు నువ్వు కానీ.. ఆధిత్య కానీ నామీద చేయి వేస్తే.. ఈ నీళ్లు తాగి చస్తాను. ఇందులో విషం ఉంది. నాకు ఏదైనా జరిగితే దానికి కారణం మీరు అందరూ అని రాసి పెట్టి ప్రియమణికి ఇచ్చి వచ్చాను. అంటుంది. ఈలోపు తలుపు చప్పుడు అవుతుంది. తలుపు తీయడానికి ఆదిత్య వెళుతుంటే మోనిత ఆపుతుంది. వద్దు అని చెబుతుంది. దీంతో కార్తీక్ వెళ్లి తలుపు తీస్తాడు. అక్కడ దీప ఉంటుంది. దీప మోనితను చూసి.. భాగ్యంతో పిన్నీ నువ్వు కేరేజీ తీసుకు రాలేదా అంటుంది. దీంతో భాగ్యం తెచ్చాను కానీ.. ఇది విషం నీళ్లు తాగుతాను అని బెదిరిస్తోంది. అంటుంది.

నాకు ప్రేమించే హక్కు లేదా?

దీంతో దీప ”తగనియ్యండి డాక్టర్ బాబు. ఏమవుతుంది. దాని ప్రాణమే కదా పోతుంది. పోనీయండి.” అంటూ రావే తాగు ఈ నీళ్ళు తాగు ఎలా చచ్చిపోతావో చూడాలి అంటూ బాటిల్ మోనిత దగ్గరకు జరుపుతుంది. అయితే, మోనిత బాటిల్ ముట్టుకోదు. పోనీ నేను తాగనా? అంటూ వాటర్ బాటిల్ మూతతీసి గడగడా తాగేస్తుంది.  దీపకు ఏమీ కాదు. దీంతో దీప ఎన్ని రోజులు ఇటువంటి నాటకాలు ఆడతావు? చెయ్యి కోసుకుని ఒకసారి.. విషం అంటూ ఒకసారి అని గట్టిగా మోనితను నిలదీస్తుంది. తన నాటకం బయటపడిపోవడంతో మోనిత దీప కాళ్ళ మీద పడిపోతుంది. పిచ్చి పట్టినదానిలా మాట్లాడుతుంది. తనకు కార్తీక్ అంటే ప్రాణం అని చెబుతుంది. మీ రందరూ పెళ్లయిన వాడిని ప్రేమించింది అంటున్నారు. కానీ, నేను కార్తీక్ ను పదహారేళ్లుగా ప్రేమిస్తున్నాను. అంటూ కార్తీక్ ను చెప్పు కార్తీక్ అని అడుగుతుంది. కార్తీక్.. కాదు అని అరుస్తాడు. నేను నిన్ను స్నేహితురాలిగానే చూశాను. మన మధ్య ఎప్పుడూ ఇలాంటి ప్రస్తావన రాలేదు. నేను రానీయలేదు. అని ఖచ్చితంగా చెప్తాడు. నన్ను పెళ్లి చేసుకోవా అని మోనిత అడుగుతుంది. దానికి కార్తీక్ చేసుకోను అంటూ తెగేసి చెబుతాడు. దీంతో మరింత పిచ్చిగా మోనిత తయారు అవుతుంది. ఇష్టం వచ్చిఅంట్టు మాట్లాడుతుంది. దీప ఆపవే అని గట్టిగా అరుస్తుంది. దీంతో నాకు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే హక్కు లేదా? అని అడుగుతుంది.

ఇప్పడు కార్తీక్ ఏం చేస్తాడు? మోనిత అక్కడ నుంచి వెళుతుందా? మోనిత పిచ్చిదానిలా మారిపోతుందా? ఇవన్నీ రేపటి ఎపిసోడ్ (1103) లో చూడాల్సిందే!

Also Read: Karthika Deepam Serial: స్టాఫ్ తో బయటకు గెంటించేస్తా.. దీప వార్నింగ్! అంజి మిస్సింగ్..మలుపు తిరిగిన మోనిత కథ!!

Karthika Deepam Latest: 25 తేదీ తరువాత ఈయన మన ఉమ్మడి మొగుడు..ఆయన కామన్ మామగారు.. దీపతో మోనిత ఛాలెంజ్!

Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu