Karthika Deepam Latest: 25 తేదీ తరువాత ఈయన మన ఉమ్మడి మొగుడు..ఆయన కామన్ మామగారు.. దీపతో మోనిత ఛాలెంజ్!

సాధారణంగా టీవీల్లో సీరియల్ అంటే..మహిళలు మాత్రమే చూస్తారు అనేది ఓ పెద్ద నమ్మకం. ఆ నమ్మకాన్ని పటాపంచలు చేసింది బుల్లితెర మెగా సీరియల్ కార్తీకదీపం. సీరియల్ ప్రారంభం అయింది మొదలు ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటూ సాగిపోతోంది.

Karthika Deepam Latest: 25 తేదీ తరువాత ఈయన మన ఉమ్మడి మొగుడు..ఆయన కామన్ మామగారు.. దీపతో మోనిత ఛాలెంజ్!
Karthika Deepam Serial
Follow us
KVD Varma

|

Updated on: Jul 24, 2021 | 7:59 AM

Karthika Deepam 1100 Episode: సాధారణంగా టీవీల్లో సీరియల్ అంటే..మహిళలు మాత్రమే చూస్తారు అనేది ఓ పెద్ద నమ్మకం. ఆ నమ్మకాన్ని పటాపంచలు చేసింది బుల్లితెర మెగా సీరియల్ కార్తీకదీపం. సీరియల్ ప్రారంభం అయింది మొదలు ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటూ సాగిపోతోంది. రోజులు గడుస్తున్నాయి. ఎపిసోడ్ లెక్కలు పెరుగుతున్నాయి. కానీ, కార్తీకదీపం అదే ప్రేక్షకాదరణతో కొనసాగుతోంది. డాక్టర్ బాబు కార్తీక్ దీపను ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. డాక్టర్ బాబును ప్రేమించిన మోనిత ఆ నిజాన్ని జీర్ణించుకోలేక కార్తీక్ మీద ప్రేమను చంపుకోలేక..ఎలాగైనా కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కార్తీక్..దీపల మధ్య పెద్ద అనుమాన భూతాన్ని ప్రవేశ పెట్టి ఇద్దరినీ పదేళ్ళ పాటు కలవకుండా చేసింది మోనిత. ఈ పదేళ్ళు కార్తీక్ కి దగ్గర అవ్వాలని విశ్వప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే, అది సాధ్యం కాలేదు. ఈలోపు దీప విషయంలో తాను తప్పు చేశానని కార్తీక్ గ్రహిస్తాడు. దీప, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండాలని భావిస్తాడు. మరి మోనిత ఊరుకుంటుందా? తాను గర్భవతి అని కొత్త విషయాన్ని చెప్పి.. దాని ఆధారంగా కార్తీక్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. కార్తీక్ ను పెళ్లి చేసుకుంటానని శపథం చేసి హంగామా చేస్తోంది..మోనిత ప్రయత్నాలు ఏమవుతాయనే ఆసక్తితో కార్తీకదీపం అందర్నీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది.

నిన్నటి (1099) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక్ తండ్రి ఆనందరావుకి మోనిత గర్భవతి అని తెలియదు. కార్తీక్, మోనిత రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలిసి మోనితను అక్కడకు పిలిచి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే, ఆమె అతన్ని అసలు లెక్కచేయకుండా మాట్లాడటమే కాకుండా.. తాను గర్భవతిని అని.. దానికి కారణం కార్తీక్ అని చెబుతుంది. దీంతో షాక్ తిన్న ఆనందరావుకు గుండెపోటు వస్తుంది. కార్తీక్ తన ఆసుపత్రిలో ఆనందరావుకు ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే, కార్తీక్ ను అసహ్యించుకుని తనకు ట్రీట్మెంట్ చేయొద్దని చెబుతాడు. అసలు కొడుకు మొహం చూడటానికి కూడా ఇష్టపడడు. దీంతో చేసేదేమీలేక కార్తీక్ వేరే డాక్టర్ కు అతని ట్రీట్మెంట్ చూడమని చెబుతాడు. మరి ఈరోజు (1100) ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది? ఆనందరావు కోలుకుంటాడా? మోనిత ఏం చేస్తుంది? ఇంత అల్లరి చేసిన మోనితను కార్తీక్ ఇంకా మౌనంగానే భరిస్తాడా? ఇప్పటికే మోనిత విషయంలో ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్న వంటలక్క దీప ఇప్పుడు ఏం చేయబోతోంది.. తెలుసుకుందాం..

నేనూ మీ వైపే ఉన్నాను డాక్టర్ బాబూ..

ఆసుపత్రిలో దీప, కార్తీక్, ఆదిత్య ఆనందరావు గది బయట దిగులుగా ఉంటారు. ఇంతలో భాగ్యం అక్కడకు వచ్చి.. అన్నయ్యగారు మాట్లాడారు. ఆయన బాగానే ఉన్నారు అని చెబుతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్ ఏమైంది? అంకుల్ ఎందుకు అంత కోపంగా ఉన్నారు? ఆయనకు వెంటనే యాంజియో గ్రామ్ చేయాలి.. స్టంట్ కూడా పడొచ్చు అంటాడు. దీంతో కార్తీక్ ఆదిత్యా వెళ్లి ఆ ఫార్మల్టీస్ చూడు అని చెప్తాడు. సరే అంటూ డాక్టర్ తో కలసి వెళతాడు ఆదిత్య. ఇక కార్తీక్ తనని తండ్రి అన్న మాటలు తలుచుకుని కుమిలి పోతుంటాడు. ఈలోపు దీప వచ్చి కార్తీక్ ను ఏమైంది డాక్టర్ బాబూ అని అడుగుతుంది. మావయ్యగారు ఏమైనా అన్నారా అని ప్రశ్నిస్తుంది. ”అవును దీపా.. తిడితే బావుండేది..కొడితే కొడితే బావుండేది.. వెళ్ళగొడితేనే నరకంగా ఉంది.” అంటాడు. పాముతో స్నేహం చేస్తే నేనూ ఆపుట్టలో పుట్టినవాడినె అనుకుంటారు. నేను మోనితతో చేసిన స్నేహం నన్ను ఈవేళ ఏ స్థితికి తీసుకువచ్చిందో చూశావా అంటాడు. దీనికి దీప బాధ పడొద్దు కార్తీక్.. అని ఓదారుస్తుంది. కాదు దీపా..నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను. నిన్నూ, పిల్లలనీ పెట్టిన బాధకు ఇప్పుడు నాకు శిక్ష పడింది. ఇప్పుడు అమ్మా, నాన్న నన్ను వెలివేశారు. రేపు సమాజం కూడా వెలివేస్తుంది అంటూ బాధపడతాడు. ”ఎందుకు డాక్టర్ బాబూ అంత ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు? మీరు మీ వ్యక్తిత్వం నిలబెట్టుకున్నారు.” అంటుంది దీప. ” నేను కాదు దీపా వ్యక్తిత్వం నిలబెట్టుకున్నది. నువ్వు. నీ వ్యక్తిత్వంతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు” అంటాడు కార్తీక్. ”న్యాయం మీ వైపు ఉంది డాక్టర్ బాబు.. నేనూ మీ వైపే ఉన్నాను..” అంటూ దీప కార్తీక్ కు భరోసా ఇస్తుంది. దీంతో కార్తీక్ ఆమె భుజంపై తలపెట్టుకుని ”నన్ను ఇంకా దగ్గరగా తీసుకో దీపా. జాలి, కరుణ ఇటువంటివి లేకుండా నీ ప్రేమతో ఇంకా దగ్గర తీసుకో” అంటాడు కార్తీక్. పడండి డాక్టర్ బాబు బయటకు వేళదామని అంటుంది దీప. ఎక్కడికి అని అడుగుతాడు కార్తీక్. చెబుతాను పదండి అని అతని చేయి పట్టుకుని బయటకు నడుస్తుంది.

ఇద్దరికీ తేడా ఏముంది? తాళి ఒక్కటే కదా?

ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న కార్తీక్, దీపలను అడ్డుకుంటుంది మోనిత. నేరుగా కార్తీక్ చేయిపట్టుకుని అరగంట పని ఉంది నాతొ రా అంటుంది. ఎక్కడికి? అయినా.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చేసేది అంతా చేసి అంటాడు కార్తీక్. అదేమిటి కార్తీక్..మావయ్యగారికి హార్ట్ ఎటాక్ వస్తే నా తప్పేముంది? అని ప్రశ్నిస్తుంది మోనిత. అసలు నీకేమిటి సంబంధం అని గట్టిగా నిలదీస్తాడు కార్తీక్. అలా అంటావేమిటి కార్తీక్..”దీపా నీ బిడ్డల్ని కడుపులో మోసింది.. నేనూ నీ బిడ్డని కడుపులో మోస్తున్నాను. ఇద్దరికీ తేడా ఏముంది? తాళి ఒక్కటే కదా? 25 వ తేదీ ఆ తాళి కూడా కట్టేస్తే.. మేమిద్దరం ఒకటే కదా.. అయినా పైలోకంలో ఎంతమందికి ఇద్దరు భార్యలు లేరు? రేపు పెళ్ళయితే నీకూ ఇద్దరు భార్యలు ఉంటారు ఇందులో తప్పేముంది?” అంటూ అడుగుతుంది. నాకు పూర్తిగా అర్ధం అయింది. నువ్వు మా కుటుంబాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఏం చేసినా.. మేమంతా సమిష్టిగానే ఉంటాం. మేము ఎలా ఉన్నా కష్టం, సుఖం అందరూ కలిసే పంచుకుంటాం. నువ్వు ముందు ఇక్కడి నుంచి పద” అంటాడు.

ఇంతలో దీప కల్పించుకుని ఇంత చేసి మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చావే? మావయ్యగారి ప్రాణాల్ని రిస్క్ లో పెట్టి ఏం సాధించుదామని అనుకుంటున్నావు? అని ప్రశ్నిస్తుంది. ”అలా అంటావేమిటి దీపా..రేపు పెళ్ళయితే ఆయన నాకూ మావయ్యే అవుతారు కదా” అని అడుగుతుంది. దీప ఎదో చెప్పబోతుంటే..కార్తీక్ అరగంట పని ఉంది నాతో రా అని మళ్ళీ అడుగుతుంది మోనిత. దీంతో ఒళ్ళు మండిన కార్తీక్.”నేను రాను. నేను ఇదివరకటి కార్తీక్ అనుకుంటున్నావా నీ వెంట రావడానికి..” అని కోపంగా చెబుతాడు. దీంతో దీప వెళ్ళండి డాక్టర్ బాబు.. 25న జరగబోయే పెళ్లిపనులు చేసుకోవాలేమో. తాను జరగబోయే పెళ్లి పనుల కోసం మిమ్మల్ని పిలుస్తోంది. ఈ లోపు నేను ఆ పెళ్లి పెటాకులు చేయడానికి నా పనులు నేను చేసుకుంటాను.. అయినా ఈ టైం లో అంజి ఉంటె బావుంటుంది.. అంజి అయితే కరక్ట్ గా దీని పెటాకుల పని చేస్తాడు. అంజిని మళ్ళీ పిలుద్దాం డాక్టర్ బాబూ అంటుంది. దీంతో మోనిత షాక్ తింటుంది. ”ఏమిటి..దీప ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది” అనుకుంటుంది మనసులో. కానీ, పైకి మాత్రం ”అక్కడ లోపల మావయ్యగారికి స్టంట్ వేయించే పని చూడు కార్తీక్. ఇక్కడ ఎందరు మన పెళ్లి తప్పించడానికి ఎవరెన్ని స్టంట్స్ వేసినా పెళ్లి మాత్రం తప్పించలేరు.” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

విషం కలిపిన నీళ్ళు తాగిన దీప..

దీప ఇంట్లో కార్తీక్.. భాగ్యం అందరూ ఉంటారు. ఈ సమయంలో మోనిత వచ్చి అందరినీ బెదిరిస్తుంది. భాగ్యం ఆమెను కొట్టబోతుంది. దీంతో మోనిత ”నాకు తెలుసు.. మీరు నన్ను కొడతారని అందుకే.. ఈ బాటిల్ తెచ్చా. ఇదేమితో తెలుసా? విషం కలిపిన నీళ్ళు. మీరు నన్ను కొట్టడానికి వస్తే ఇవి తాగేస్తాను” అంటూ బెదిరిస్తుంది. అందరూ షాక్ అయి నిలబడి పోతారు. దీంతో దీప ”తగనియ్యండి డాక్టర్ బాబు. ఏమవుతుంది. దాని ప్రాణమే కదా పోతుంది. పోనీయండి.” అంటూ రావే తాగు ఈ నీళ్ళు తాగు ఎలా చచ్చిపోతావో చూడాలి అంటూ బాటిల్ మోనిత దగ్గరకు జరుపుతుంది. అయితే, మోనిత బాటిల్ ముట్టుకోదు. పోనీ నేను తాగనా? అంటూ వాటర్ బాటిల్ మూతతీసి గడగడా తాగేస్తుంది.. మరి ఆ నీళ్ళు తాగిన దీపకు ఏమవుతుంది? మోనిత పరిస్థితి ఏమిటి? కార్తీక్ ఏం చేస్తాడు.. సోమవారం ప్రసారమయ్యే కార్తీకదీపం 1101 ఎపిసోడ్ వరకూ ఆగితేనే కానీ, తెలీదు!

Also Read: Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!

Karthika Deepam July 22 Episode: మా ఆయన సాఫ్ట్ వేర్.. నేను హార్డ్ వేర్.. మోనిత చేత నీళ్ళు తాగించిన దీప!