Karthika Deepam July 22 Episode: మా ఆయన సాఫ్ట్ వేర్.. నేను హార్డ్ వేర్.. మోనిత చేత నీళ్ళు తాగించిన దీప!

Karthika Deepam July 22 Episode: కార్తీకదీపం బుల్లితెర మీద ఇప్పుడు సంచలనం. వెయ్యి ఎపిసోడ్లు దాటిపోయినా ప్రేక్షకులకు అదే వినోదాన్ని అందిస్తోంది. ట్విస్ట్ లతో కథ ముందుకు సాగిపోతోంది.

  • Updated On - 8:36 am, Thu, 22 July 21
Karthika Deepam July 22 Episode: మా ఆయన సాఫ్ట్ వేర్.. నేను హార్డ్ వేర్.. మోనిత చేత నీళ్ళు తాగించిన దీప!
Karthika Deepam

Karthika Deepam July 22 Episode: కార్తీకదీపం బుల్లితెర మీద ఇప్పుడు సంచలనం. వెయ్యి ఎపిసోడ్లు దాటిపోయినా ప్రేక్షకులకు అదే వినోదాన్ని అందిస్తోంది. ట్విస్ట్ లతో కథ ముందుకు సాగిపోతోంది. అనుబంధాల మధ్యలో ఉన్న అంతరాల్ని ఎత్తి చూపిస్తూ.. మంచి చెడుల మధ్య వ్యత్యాసాలను సున్నితంగా ప్రదర్శిస్తూ కార్తీకదీపం అందరినీ అలరిస్తోంది.

కార్తీకదీపం టూకీగా..

కార్తీక్ ఓ డాక్టర్. పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి. విలువలకు ప్రాధాన్యమిచ్చే కుటుంబంలో పెరిగిన మనిషి. మరోవైపు దీప దిగువ మధ్య తరగతిలో జన్మించిన మహిళ. కష్టాల సుడిలో పెరిగిన వనిత. ఇద్దరికీ వివాహం జరుగుతుంది. ఇక కార్తీక్ ను గుడ్డిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది డాక్టర్ మోనిత. కార్తీక్ పెళ్లి దీపతో జరిగిపోవడంతో వారిద్దరినీ విడదీస్తుంది. కార్తీక్ మనసులో దీప మీద అనుమాన బీజాన్ని నాటుతుంది. గర్భవతి అయిన దీప ఇంటినుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది. పదేళ్ళ పాటు కార్తీక్ దీపలు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటారు. మధ్యలో ఎన్నో మలుపులు తిరిగిన వీరి జీవితంలోకి మళ్ళీ సంతోషం వస్తూంది. దీపను తాను అనవసరంగా అనుమానించానని తెలుసుకున్న కార్తీక్ తన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడతాడు. సరిగ్గా ఈ సమయంలో మోనిత మళ్ళీ బాంబ్ పేలుస్తుంది. తాను గర్భవతిననీ.. దానికి కారణం కార్తీక్ అనీ కొత్త కథ మొదలు పెట్టింది. కార్తీక్ ను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని శపథం చేసింది. ఇప్పుడు కార్తీక్ మోనితను పెళ్లి చేసుకుంటాడా? మరి దీప ఎం చేస్తుంది? ఈ రెండు పాయింట్లు ఆసక్తికరంగా మారాయి. మోనిత రకరకాలుగా కార్తీక్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. మరి ఏమి జరుగుతుందనేది నడుస్తున్న కథ.

నిన్న ఎపిసోడ్ 1097 లో ఏమి జరిగిందంటే..

నిన్నటి ఎపిసోడ్ లో కార్తీక్ ను అతని తండ్రి ఆనందరావు మోనిత విషయంలో నిలదీస్తాడు. దీపకు అన్యాయం చేస్తున్నందుకు మందలిస్తాడు. దీప ఆనందరావుకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు మోనిత ఎలాగైనా కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉంటుంది. తను ఒకప్పుడు చేసిన పాపానికి సాక్షి అయిన అంజి సీన్ లోకి వస్తే తన కథ ముగిసిపోతుందని భావిస్తూ ఉంటుంది. అంజి ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే పనిలో ఉంటుంది. ఇక కార్తీక్ ను దీపను దూరం చేయడానికి.. కార్తీక్ ను మానసికంగా టార్చర్ చేసే పని కొనసాగిస్తుంది. కార్తీక్ ను కలిసిన మోనిత.. ” నాది బ్లాక్ మెయిల్ అంటే నేనేం చెయ్యలేను కార్తీక్. ఆల్ రెడీ మన కేసులో ఏసీపీ కూడా నా బిడ్డకు న్యాయం చెయ్యాలనే చూస్తుంది. నీకు వేరే దారి లేదు కార్తీక్. తప్పించుకోవాలని చూస్తే మాత్రం నువ్వు వేరే మోనితని చూస్తావ్.” అంటూ బెదిరిస్తుంది మోనిత. దీంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. ”నేను ఇప్పుడు నా కాపురాన్నే కాదు దీపని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి రాబోతుందా?” అనుకుంటాడు మనసులో.

దీపకు షాక్..

కార్తీకదీపం ఈరోజు (1098వ ఎపిసోడ్) మరింత ఆసక్తికరంగా మారింది. అర్ధరాత్రి ఇంట్లో ఎదో కింద పడిన శబ్దం విన్న దీప నిద్ర నుంచి లేచి బయటకు వస్తుంది. అక్కడ హాలులో నేల మీద ముసుగు పెట్టి పడుకుని ఉన్న కార్తీక్ ని చూస్తుంది. ”‘డాక్టర్ బాబు.. ఎలా బతికారు.. ఎలా అయిపోయారు. నేల మీద పడుకున్నారు పాపం.. ఇవాళ్టి నుంచి.. ఆయన్ని మంచంపై పడుకోమని నేను పిల్లలు నేల మీద పడుకుంటాం” అనుకుంటూ.. డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని నిద్రలేపుతుంది. లేవకపోయే సరికి దుప్పటి తీసి చూస్తుంది. అయితే అక్కడ ఉన్నది మోనిత అని చూసి షాక్ అవుతుంది. అక్కడ కార్తీక్ బదులు మోనిత పడుకుని ఉంటుంది. దీపను చూసి వెటకారంగా నవ్విన మోనిత షాక్ అయ్యావా అంటూనే.. మీరిద్దరూ గదిలో పడుకున్నారుగా.. అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడే పడుకున్నా అంటూ జుగుప్సగా మాట్లాడుతుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన దీప మోనితను బయటకు తీసుకుని వస్తుంది. అక్కడ కార్తీక్ క్లినిక్ లో ఒంటరిగా కూచుని ఉంటాడు. వీరిద్దరినీ చూసి దగ్గరగా వచ్చి ఏమిటిది మోనితా అని అడుగుతాడు. దీంతో మోనిత మరింత రెచ్చిపోతుంది. దీపను అక్కా అని సంబోధిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలు పెడుతుంది.

కార్తీక్ మోనితను గట్టిగా అడ్డుకుంటాడు. ”నేను నిన్ను ఒక ఆడదానిలా చూసుంటే ఎప్పుడో నువ్వు తల్లివి అయ్యేదానివి. ఇప్పటికీ నాకు నీమీద ఎలాంటి ఫీలింగ్ లేదు . ఇప్పటి వరకూ నీ ప్రొఫెషన్ చూసి కాస్తయినా గౌరవం ఇచ్చేవాడిని. ఇప్పుడు అదీ కూడా లేదు” అంటూ సీరియస్ అవుతాడు. దానికి మోనిత కూడా అంతే గట్టిగా రియాక్ట్ అవుతుంది..ఇవాళ నీకు నేను ఆడదానిలానే కనపడటం లేదు. నాకు తెలుసు ఎదురుగా పెళ్ళాన్ని పెట్టుకుని నాతో మాట్లాడటానికి నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావు. నాకు తెలుసు. అందుకే మన పెళ్లి జరగాలి. ఆ తరువాత నేను ఆడదానిగా ఏమిటి అప్సరసలా కనిపిస్తాను. 25వ తేదీ తరువాత మన పెళ్లి అయిపోతే నేను నీ భార్యను అయిపోతాను. అప్పుడు మహా అయితే నీకు ఇద్దరు భార్యలు అనే గిల్టీ ఫీలింగ్ ఉంటుందేమో..దాన్ని కూడా నేను నీ మనసులోంచి తీసేస్తాను” అంటూ చెబుతుంది. ఇంకా అసభ్యకరంగా చాలా గట్టిగా మాట్లాడుతుంది. తరువాత గుడ్ నైట్ కార్తీక్ వస్తా అంటూ వెళ్ళడానికి రెడీ అవుతుంది.

మోనితకు చెమటలు పట్టించిన దీప

వెళ్ళిపోవడానికి రెడీ అయిన మోనితను ఆపిన దీప.. కార్తీక్ ను ఇంట్లోకి వెళ్ళండి డాక్టర్ బాబూ అంటుంది. దీంతో కార్తీక్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. తరువాత దీప మోనిత దగ్గరకు వచ్చి ”ఇంత బరితెగించినా.. ఇంత విచ్చలవిడితనంగా మాట్లాడినా.. అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి ఇంత అసహ్యకరంగా..జుగుప్సాకరంగా.. కంపరంగా మాట్లాడినా నిన్ను నేను నా భర్తా ఏమీ చేయడం లేదు. ఎందుకో తెలుసా? ఇంత నీతి తప్పిన..దారి తప్పిన.. పెళ్లికాకుండానే నెల తప్పిన నిన్ను కొట్టకుండా తిట్టకుండా ఎందుకు వదిలేస్తున్నామో తెలుసా? లోపల పిల్లలు ఉన్నారని.. వాళ్ళు లేస్తే.. నీ చరిత్ర వింటే బావుండదని..” అంటూ మొదలు పెట్టి కడిగి పారేస్తుంది. ”నువ్వు కేలండర్ లో మార్క్ చేసి పెట్టుకున్న ఆ 25వ తేదీ వరకూ ప్రతిరోజూ ప్రతి డేట్ మీద ఎర్ర ఇంకుతో సున్నా చుట్టి పెట్టుకో. ఎందుకంటే.. 25వ తేదీకి నీకు ఆ సున్నానే మిగులుతుంది. నువ్వు ఎటువంటి పరిస్థితిలోనూ కార్తీక్ ను పెళ్లి చేసుకోలేవు.” అని మొహం పగిలేలా చెబుతుంది. అంతేకాదు..”అంజిని తీసుకు వస్తే నీ కథ మారిపోతుంది. నువ్వు మాటలతో వినేలా లేవు.. అంజి వస్తాడు అప్పుడు చూద్దాం” అంటూ సీరియస్ గా చెబుతుంది. దీంతో మొనితకు చెమటలు పడతాయి. ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. దీప లోపలి వెళ్లి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇస్తే గ్లాసు దించకుండా గటగటా తాగేస్తుంది. ఈలోపు కార్తీక్ అక్కడికి వస్తాడు. దీప కార్తీక్ దగ్గరకు వెళ్లి అతని చేతిని పట్టుకుని మోనితతో బ్యాడ్ నైట్ మోనితా.. బ్యాడ్ డ్రీమ్స్ అంటూ చెబుతుంది.

సీన్ లోకి ఆనందరావు..

మరోవైపు మోనిత గర్భవతి అని తెలీని ఆనందరావు.. రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి కార్తీక్, మోనిత పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్న కాగితం తీసుకుంటాడు. అక్కడ నుంచి మోనితకు ఫోన్ చేస్తాడు. మోనిత ను వెంటనే వచ్చి కలవమని చెబుతాడు. మోనిత ఈ విషయాన్ని కార్తీక్ కు ఫోన్ చేసి చెబుతుంది. దీంతో కార్తీక్, దీప రిజిస్టర్ ఆఫీస్ కు బయలు దేరుతారు. కారులో రిజిస్టర్ ఆఫీసుకు వెళుతున్న మోనిత ”ఇప్పుడు మీ ఇద్దరిలో ఎంత టెన్షన్ మొదలవుతుందో నాకు అర్థం అవుతోంది. రా.. నీ పెళ్ళాం చేసిన ఒక కూర..పచ్చడి అలానే వదిలేసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు పరిగెత్తుకు రా ” అని నవ్వుకుంటుంది.

తరువాత ఏం జరుగుతుంది?

మోనిత రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఆనందరావును కలిసిందా? ఆనందరావు మోనితను ఎందుకు అక్కడికి రమ్మన్నాడు? కార్తీక్ దీప రిజిస్టర్ ఆఫీస్ వద్దకు వెళ్ళారా? మోనిత గర్భవతి అనే విషయం ఆనందరావుకు తెలుస్తుందా? తర్వాత ఏమవుతుంది.. ఇవన్నీ రేపటి ఎపిసోడ్ లో తెలుస్తాయి. అంతవరకూ ఈరోజు ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి..