Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya: వర్షంపై కవిత్వాన్ని షేర్ చేసిన అనసూయ.. ఆ అందమైన కవిత్వం ఎవరు రాసిందో తెలుసా..

యాంకర్‎గా కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. అటు బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపై కూడా తన నటనతో..

Anasuya: వర్షంపై కవిత్వాన్ని షేర్ చేసిన అనసూయ.. ఆ అందమైన కవిత్వం ఎవరు రాసిందో తెలుసా..
Anusuya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2021 | 6:33 PM

యాంకర్‎గా కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. అటు బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపై కూడా తన నటనతో.. ప్రేక్షకులను అలరిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం సినిమాలో.. రంగమ్మాత్త పాత్రలో అనసూయ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత అనసూయకు తెలుగులో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ఆ తర్వాత క్షణం, కథనం వంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‏లలో నటించి మెప్పించింది. ఇటీవల థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ.. మరోసారి తన నటనకు మంచి మార్కులే పొందింది.

ప్రస్తుతం టీవీ షోలతోపాటు.. పలు సినిమా ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉంది అనసూయ. ఇదిలా ఉంటే.. అనసూయ.. ప్రస్తుతం టీవీ షోలతోపాటు.. పలు సినిమా ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉంది అనసూయ. ఇదిలా ఉంటే.. అనసూయ.. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలపై తనదైన స్టైల్‏లో కామెంట్ చేసింది.. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతరామ శాస్త్రి గారు రాసిన పాటలోని చరణాలను మరోసారి గుర్తుచేసింది. చిన్ననాటి తాయిలంలా .. నిన్ను నాలో దాచుకోనా.. కన్నెయీటీ సోయగంలా .. నన్ను నీలో పోల్చుకోనా.. పెదవులు పాడేకిలకిలలోన.. పదములు ఆడే కథకళిలోన.. కనులను తడిపే కలతలలోన.. నా అణువణువున నువు కనిపించేలా.. నువ్వొస్తానంటే నేనొద్దంటాన .. వాన! అంటూ కవిత్వాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం అనసూయ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ట్వీట్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది అనసూయ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Samantha Akkineni: మీరు లేకుండా జీవితం ఒకేలా ఉండదు.. ఫ్రెండ్‏తో కలిసి నైట్ పార్టీలో నవ్వులు చిందిస్తున్న సామ్.. ఫోటో వైరల్.

షూటింగ్ సమయంలో చిరంజీవి నాపై అరిచాడు.. అసలు కారణం అదే.. ఆసక్తికర విషయాలను చెప్పిన అన్నపూర్ణ..