Samantha Akkineni: మీరు లేకుండా జీవితం ఒకేలా ఉండదు.. ఫ్రెండ్‏తో కలిసి నైట్ పార్టీలో నవ్వులు చిందిస్తున్న సామ్.. ఫోటో వైరల్.

ప్రముఖ సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది సమంత అక్కినేని. ఈ సందర్భంగా.. తనతోపాటు తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకుంది సామ్.

Samantha Akkineni: మీరు లేకుండా జీవితం ఒకేలా ఉండదు.. ఫ్రెండ్‏తో కలిసి నైట్ పార్టీలో నవ్వులు చిందిస్తున్న సామ్.. ఫోటో వైరల్.
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2021 | 4:51 PM

ప్రముఖ సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది సమంత అక్కినేని. ఈ సందర్భంగా.. తనతోపాటు తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకుంది సామ్. అందులో సమంత.. మల్టీ కలర్ ఫ్లాక్ ధరించి.. తన స్నేహితురాలిని పట్టుకుని నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత.. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యను లవ్ మ్యారెజ్ చేసుకున్న తర్వాత కూడా సమంత ఇప్పటికీ సినిమాల్లో వరుస ఆఫర్లను అందుకుంటుంది. అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ఫ్లా్ట్ ఫామ్‏పై కూడా సమంత తన సత్తాను చాటుకుంటుంది. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్.. అందులో రాజీ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా.. తన స్నేహితురాలు.. డిజైనర్ శిల్పారెట్టి పుట్టిన రోజు సందర్భంగా సమంత తన ఇన్‏స్టాగ్రామ్‏లో.. మీరు లేకుండా ఈ జీవితం ఒకేలా ఉండదు. మీతో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసిన రాత్రులవి అంటూ కామెంట్ చేసింది.

ట్వీట్..

ప్రస్తుతం సమంత.. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మూవీతో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ వెండితెరకు పరిచయం కాబోతుంది. అటు తమిళంలో విజయ్ సేతుపతి.. నయనతార హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కాతువాకుల రేండు కాదల్ చిత్రంలోనూ సామ్ నటించబోతుంది. ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: RRR Movie: “ఆర్ఆర్ఆర్” మూవీ కోసం జక్కన్న నయా ప్లాన్.. రంగంలోకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ మూవీ టీం పై మహేష్ అసంతృప్తి ? ఆ విషయంలో చిత్రయూనిట్ పై సీరియస్..