Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: “ఆర్ఆర్ఆర్” మూవీ కోసం జక్కన్న నయా ప్లాన్.. రంగంలోకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజు రోజూకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సినిమా ముందు నుంచి జనాల్లో క్యూరియాసిటీని కలిగిస్తున్నాడు

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ కోసం జక్కన్న నయా ప్లాన్.. రంగంలోకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2021 | 4:23 PM

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజు రోజూకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సినిమా ముందు నుంచి జనాల్లో క్యూరియాసిటీని కలిగిస్తున్నాడు జక్కన్న. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. అయితే ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‏తో సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోతో.. సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక జక్కన్న కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నాయి.

అయితే సినిమాకు తగ్గట్టుగానే.. ఓ భారీ సెట్ నిర్మించి ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరించాలని భావిస్తున్నాడట రాజమౌళి. అయితే ఈ సాంగ్‏ కోసం జక్కన్న స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. సినిమా విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్‏తో జనాల్లో మరింత ఆసక్తిని పెంచాలని భావిస్తున్నాడట. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ సాంగ్ కోసం.. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‏ను రంగంలోకి దించుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో అనిరుధ్ కూడా తనదైన స్టైల్లో సాంగ్ పాడుతూ స్టెప్పులేయనున్నాడట. అనిరుధ్… ప్రమోషనల్ సాంగ్స్‏ను జనాల్లోకి తీసుకుపోవడంలో దిట్ట. ఇప్పటికే నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాకు ప్రమోషనల్ సాంగ్ పాడుతూ..తన డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా మరోసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్.. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేయనున్నాడు అనిరుధ్. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామా అలియా భట్.. హాలీవుడ్ బ్యూటీ ఓలీవియా హీరోయిన్స్‏గా నటిస్తున్నారు.

Also Read: Sonu Sood: తల్లి పుట్టిన రోజు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సోనూసూద్.. ట్వీట్ వైరల్..

Karthikeya: డిఫరెంట్ గెటప్‍లో కార్తికేయ.. “రాజ విక్రమార్క”‏గా రాబోతున్న యంగ్ హీరో..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ మూవీ టీం పై మహేష్ అసంతృప్తి ? ఆ విషయంలో చిత్రయూనిట్ పై సీరియస్..

భార్య ఆరోగ్యంపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్.. పరిస్థితి ఎలా ఉందంటే?
భార్య ఆరోగ్యంపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్.. పరిస్థితి ఎలా ఉందంటే?
అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..