Sonu Sood: తల్లి పుట్టిన రోజు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సోనూసూద్.. ట్వీట్ వైరల్..

కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అపద్బాంధవుడిగా మారాడు సోనూసూద్. గతేడాది మొదలు పెట్టిన ఆయన సామాజిక సేవ.. నేటికి సామాన్యుల

Sonu Sood: తల్లి పుట్టిన రోజు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సోనూసూద్.. ట్వీట్ వైరల్..
Sonu Sood
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2021 | 4:02 PM

కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అపద్బాంధవుడిగా మారాడు సోనూసూద్. గతేడాది మొదలు పెట్టిన ఆయన సామాజిక సేవ.. నేటికి సామాన్యుల నుంచి సెలబ్రెటిలు, రాజకీయ నేతల వరకు కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా సోనూసూద్ ఆయన తల్లి పుట్టిన రోజు సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ.. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలనుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. ఈ మెసేజ్‏లు నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో.. ఎప్పటికీ వ్యక్తిపరచలేవు. మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసేవరకు ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి.. అలాగే మీరు నాకు ఎల్లప్పుడు మార్గనిర్దేశం చేయండి.. అంటూ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు రియల్ హీరో.

సోనూసూద్ 2007లో తన తల్లిని.. ఆ తర్వాత 2016లో తన తండ్రిని కోల్పోయారు. కరోనా కష్టాలలో అడిగిన వారికి తన వంతు సాయాన్ని అందిస్తున్న సోనూసూద్‏కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఇటీవల రియల్ హీరోపై అపారమైన ప్రేమతో.. సిర్సాకు చెందిన భక్తి గాయకుడు.. 11 రోజులలో 1200 కిలోమీటర్లు ప్రయాణించి…ముంబైలో కలుసుకున్న సంగతి తెలిసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సోనూసూద్.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటింస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Karthikeya: డిఫరెంట్ గెటప్‍లో కార్తికేయ.. “రాజ విక్రమార్క”‏గా రాబోతున్న యంగ్ హీరో..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ మూవీ టీం పై మహేష్ అసంతృప్తి ? ఆ విషయంలో చిత్రయూనిట్ పై సీరియస్..