Karthikeya: డిఫరెంట్ గెటప్‍లో కార్తికేయ.. “రాజ విక్రమార్క”‏గా రాబోతున్న యంగ్ హీరో..

"Rx100" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కార్తికేయ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

Karthikeya: డిఫరెంట్ గెటప్‍లో కార్తికేయ.. రాజ విక్రమార్క‏గా రాబోతున్న యంగ్ హీరో..
Karthikeya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2021 | 3:22 PM

“Rx100” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కార్తికేయ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తెలుగులో వరుస ఆఫర్లను అందుకున్నాడు ఈ యంగ్ హీరో. హిప్పీ, గుణ 369, 90ML వంటి సినిమాలతో అలరించిన కార్తికేయ.. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ.. కార్తికేయ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం.. రాజా విక్రమార్క. ఈ సినిమాతో శ్రీ సరిపల్లి అనే నూతన దర్శకుడు పరిచయడం కాబోతుండగా.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బక్రీద్ సందర్భంగా.. ఈ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో కార్తికేయ.. ముస్లిం వేషధారణలో డిఫరెంట్‏ లుక్‏లో కనిపించారు. అయితే హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోల్ కోసం కార్తికేయ భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడు. ఇక ఇదే మూవీతో కన్నడ నటుడు రవిచంద్రన్ మనవరాలు.. తాన్యా రవిచంద్రన్ తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. సాధ్యమైనంత తొందరగా.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ట్వీట్..

Also Read: Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ మూవీ టీం పై మహేష్ అసంతృప్తి ? ఆ విషయంలో చిత్రయూనిట్ పై సీరియస్..

Virata Parvam : ప్రముఖ ఓటీటీ చేతికి రానా విరాటపర్వం అంటూ టాక్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు