Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ మూవీ టీం పై మహేష్ అసంతృప్తి ? ఆ విషయంలో చిత్రయూనిట్ పై సీరియస్..

Mahesh Babu: సాధారణంగా స్టార్ హీరో సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే తమ మూవీ స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయ్యే వరకు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' మూవీ టీం పై మహేష్ అసంతృప్తి ? ఆ విషయంలో చిత్రయూనిట్ పై సీరియస్..
Sarkaru Vaari Pata
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2021 | 3:02 PM

Mahesh Babu: సాధారణంగా స్టార్ హీరో సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే తమ మూవీ స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయ్యే వరకు ఒక పద్దతిలో షెడ్యూల్ రెడీ చేసుకుంటారు మేకర్స్. అందుకే జనాలలో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‍ పోస్టర్స్, సాంగ్స్.. టీజర్.. ట్రైలర్.. ఇలా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ.. సినిమాపై ఆసక్తిని పెంచుతుంటారు. అయితే అలా కాకుండా.. సినిమాకు సంబంధించిన విషయాలు, పోస్టర్స్, వీడియోస్ ముందే లీకైతే.. ఆ చిత్రాలకు ఎంతో నష్టం చేకూరుతుంది. అందుకే లీక్‏ల విషయంలో యూనిట్ సభ్యులు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా కానీ.. కొన్ని సందర్బాల్లో పలువురు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన విషయాలు లీక్ అవుతుంటాయి. తాజాగా మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న “సర్కారు వారి పాట” విషయంలోనూ లీక్‏ల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పలు ఆన్ లొకేషన్ స్టిల్స్, స్టోరీ డైలాగ్స్ లీక్ అయ్యాయి.

ఇదే విషయంపై మహేష్ బాబు.. పలుమార్లు చిత్రయూనిట్ సభ్యులకు తెలియజేసినా ఫలితం లేదని.. మళ్లీ మళ్లీ సినిమా విషయాలు లీక్ అవుతున్నాయని.. దీంతో.. ఈ విషయమై.. మరోసారి చిత్రయూనిట్ సభ్యులపై మహేష్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. సినిమా విషయాలు, స్టిల్స్ ఇలా లీక్ అయితే ఎలా అంటూ చిత్రయూనిట్‏ను హెచ్చరించారట. దీంతో వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్.. షూటింగ్ లొకేషన్‏లోకి ఎవరూ మొబైల్ తీసుకురాకుండా ఉండాలని డైరెక్టర్ పరశురామ్ సూచించినట్లుగా తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ మూవీ రాబోతుండగా.. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‏టైన్‍మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‏టైన్‍మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Also Read: Virata Parvam : ప్రముఖ ఓటీటీ చేతికి రానా విరాటపర్వం అంటూ టాక్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

సినీప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఈ నెల 30 నుంచి థియేటర్స్ ఓపెన్

Raj Kundra Arrest: రాజ్ కుంద్రాను వెనకేసుకొచ్చిన బాలీవుడ్ నటి.. పోర్న్, ఎరోటికా వీడియోలు ఒకటి కాదంటూ..