సినీప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఈ నెల 30 నుంచి థియేటర్స్ ఓపెన్

సినీప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 30 నుంచి రాష్ట్రంలో థియేటర్లు..

సినీప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఈ నెల 30 నుంచి థియేటర్స్ ఓపెన్
Breaking
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 21, 2021 | 3:40 PM

సినీప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 30 నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. కరోనా కారణంగా గత కొద్దిరోజులుగా  తెలంగాణలో థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం.. అలాగే మంత్రి తలసాని హామీ ఇవ్వడంతో థియేటర్లను ఓపెన్‌ చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ నిర్ణయం తీసుకుంది. దీనితో చిన్న సినిమాలతోపాటు బడా సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు భారీ సినిమాలు ఓటీటీని ఆశ్రయించగా.. మరికొన్ని సినిమాలు.. థియేటర్స్ ఓపెనింగ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన సినిమాలు విడుదలకు నోచుకోక నిర్మాతలు, కోట్ల విలువ చేసే థియేటర్లు మూతవేసి, సిబ్బంది జీతాలు, కరెంటు చార్జీలు, టాక్సులు కట్టలేక థియేటర్ యజమానులు తల పట్టుకుంటున్నారు.

తెలుగు సినిమా విడుదల అంటే రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు థియేటర్లకు గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం100 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చినా, ఏపీ లో నైట్ కర్ఫ్యూ ఉన్నందున, ప్రక్క రాష్ట్రాలలో థియేటర్లు ఓపెన్ కానందున నిర్మాతలు సినిమాలు విడుడల చేయడం లేదు. పరిస్థితులు చక్కబడితే విడుదలకు నాగచైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్, రానా విరాటపర్వం, తిమ్మరుసు, ఇష్క్ తదితర సినిమాలు రెడీగా ఉన్నాయి. ఓటిటి నుండి మంచి ఆఫర్స్ ఉన్నా థియేటర్లో విడుదల చేయాలని ఆ నిర్మాతల ఆశ. జులై 23నుంచి తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు ఓపెన్ చేయాలని అనుకున్నా, ప్రభుత్వం నుంచి రావలసిన సబ్సిడీలు, పార్కింగ్ ఫీజు అనుమతి లేనిదే థియేటర్లు ఓపెన్ చేసే అవకాశం కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర థియేటర్లకు మరో సమస్య…టికెట్ రేట్లు. కారోనా కేసులు వలన 4 ఆటలకు అనుమతి లేదు. 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ పరిస్థితి లో ఏపీ లో థియేటర్లు ఓపెన్ చేయడం సాధ్యం కాని పనే. కారోనా మొదటి దశ ఆన్ లాక్ ప్రారంభం నుండి థియేటర్లకు అనుమతి కోసం ప్రభుత్వం పై ఒత్తిడి చేసిన మల్టీప్లెక్స్ యజమానులు ఈసారి సైలెంట్ గా ఉండడం గమనార్హం. ఆగస్ట్ 6న హాలీవుడ్ సినిమా fast and furious విడుదల ఉన్నందున రాష్ట్రంలో, దేశంలో పరిస్థితి చక్కబడితే ప్రేక్షకులకు థియేటర్లో సినిమా చూసే భాగ్యం కలుగుతుంది, నిర్మాతల, ఏక్సిబిటర్స్ కల నెరవేరుతుంది.

Also Read: Karthikeya: డిఫరెంట్ గెటప్‍లో కార్తికేయ.. “రాజ విక్రమార్క”‏గా రాబోతున్న యంగ్ హీరో..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ మూవీ టీం పై మహేష్ అసంతృప్తి ? ఆ విషయంలో చిత్రయూనిట్ పై సీరియస్..