AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra Arrest: రాజ్ కుంద్రాను వెనకేసుకొచ్చిన బాలీవుడ్ నటి.. పోర్న్, ఎరోటికా వీడియోలు ఒకటి కాదంటూ..

పోర్న్ వీడియోల కేసులో అరెస్టైన వ్యాపార వేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర వ్యహారంపై ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈవివాదంపై నటి, మోడల్‌ గెహనా వశిష్ట్‌ స్పందించింది. రాజ్ కుంద్రాకు మద్దతుగా నిలిచింది.

Raj Kundra Arrest: రాజ్ కుంద్రాను వెనకేసుకొచ్చిన బాలీవుడ్ నటి.. పోర్న్, ఎరోటికా వీడియోలు ఒకటి కాదంటూ..
Actress Gehana Vasisth, Raj Kundra
Venkata Chari
|

Updated on: Jul 21, 2021 | 1:30 PM

Share

Raj Kundra Arrest: పోర్న్ వీడియోల కేసులో అరెస్టైన వ్యాపార వేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర వ్యహారంపై ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈవివాదంపై నటి, మోడల్‌ గెహనా వశిష్ట్‌ స్పందించింది. రాజ్ కుంద్రాకు మద్దతుగా నిలిచింది. మేము ఎలాంటి పోర్న్‌ వీడియోలు షూట్ చేయలేదని వెల్లడించింది. తాము తీసిన వీడియోలన్ని మాములు ఎరోటికా వీడియోలు మాత్రమేనని పేర్కొంది. కానీ, కొంతమంది కావాలనే తమను టార్గెట్‌ చేశారని ‘గాంధీ బాత్‌’ ఫేమ్‌ గెహనా ఆరోపణలు గుప్పించింది. పోర్న్ వీడియోలకు, ఎరోటికా వీడియోలకు తేడా గమనించాలంటూ ఓ వీడియోను గెహనా వశిష్ట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తానసలు పోర్న్‌ సినిమాల్లో నటించలేదని, మేం తీసిన వీడియోల్లో ఒక్కటి కూడా పోర్న్‌ కేటగిరీ కిందకి రావని తెలిపింది. మేం తీసిన ఏక్తాకపూర్‌ లాంటి వాళ్లు తీసే వీడియోల్లాంటివేనని, అంతులో అశ్లీలం ఏమాత్రం లేదంటూ రాజ్ కుంద్రాకు సపోర్ట్‌గా మాట్లాడింది. ముందు మేం చేసిన వీడియోలను చూడాలని, అప్పుడు అవి పోర్నో, ఎరోటికా వీడియోలో అర్థమవుతాయని పేర్కింది. ఎరోటికా కంటెంట్‌ను పోర్న్‌ వీడియోలతో పోల్చడం మానుకోవాలని, ఇది సరైన పద్ధతి కాదని తెలిపింది. ఇంటర్నెట్‌లో ఉన్న పోర్న్‌ వీడియోలపై దృష్గి పెట్టడం మానేసి, మాపై ఎందుకు ఫోకస్ చేశారంటూ ప్రశ్నించింది.

అనంతరం.. చట్టం తన పని తాను చేస్తుందని, ముంబై పోలీసులపై పూర్తి విశ్వాసం ఉందంటూ చెప్పుకొచ్చింది. నిజమైన నేరస్థులెవరో, కోర్టులు తేలుస్తాయని పేర్కొంది. పూర్తి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తెలిపింది. కావాలనే కొందరు తనను, కుంద్రా, శిల్పాశెట్టిని టార్గెట్‌ చేస్తున్నారని గెహనా ఆరోపించింది. రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేష్ కామత్ కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధిగా పనిచేశారు. ఆ సమయంలోనే పోర్న్ ఫిల్మ్‌ల కోసం చాలా మంది ఏజెంట్లకు కాంట్రాక్టులు ఇచ్చారని, వాటినుంచి నిధులు సమకూర్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా ఒప్పందాలు చేసుకున్న వారిలో నటి గెహానా వశిష్ట్ కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.

రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు పొర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మించి, పలు యాప్‌లలో విడుదల చేసినట్లు కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు.. ఫిబ్రవరిలో నమోదైన ఓ కేసులో ప్రధాన నిందితుడిగా రాజ్‌ కుంద్రాను సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలె తెలిపారు. కాగా, ఆయనకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నాడు. జులై 23 వరకు పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. నటీ నటులను బలవంతపెట్టి నగ్నంగా ఫొటోలు తీశారని, వాటిని పెయిడ్‌ మొబైల్‌ యాప్స్‌కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

Also Read:

Raj Kundra Arrest: భర్త రాజ్ కుంద్రా కేసులో శిల్పాశెట్టి పాత్ర ఉందా? క్లారిటీ ఇచ్చిన ముంబై పోలీసులు

Raj Kundra : ఒక్కొక్కటిగా బయటపడుతోన్న రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలు..