Raj Kundra : ఒక్కొక్కటిగా బయటపడుతోన్న రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలు..

Raj Kundra Arrested: బాలీవుడ్ లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కలకలం రేపుతోంది.. అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Raj Kundra : ఒక్కొక్కటిగా బయటపడుతోన్న రాజ్ కుంద్రా చీకటి వ్యవహారాలు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 21, 2021 | 11:37 AM

Raj Kundra arrested: బాలీవుడ్ లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కలకలం రేపుతోంది.. అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మించి వాటిని వివిధ యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలతోనే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇక రాజ్ కుంద్రా అశ్లీల రాకెట్ కేసులో సంచలన విషయాలు బయటకువస్తున్నాయి. బ్రిటన్ లోని తన బందువు ప్రదీప్ బక్షి తో కలిసి రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సప్ చాటింగ్, ఈ మెయిల్స్ ద్వారా ఈ అశ్లీల చిత్రాల దందా బయటపడింది. ప్రదీప్ బక్షికి బ్రిటన్ లో ఉన్న కెన్రిన్ అనే నిర్మాణ సంస్థ నుండి హాట్ షాట్ అనే యాప్ ను హ్యాండిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్ ను టార్గెట్ గా చేసుకొని.. అశ్లీల చిత్రాలలో నటించేలా బలవంతం చేసి వాటిని చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Raj 1

ఈ పోర్న్ వీడియోలను బ్రిటన్ లోని హాట్ షాట్ యాప్ తో పాటు మరి కొన్ని యాప్ లలో అప్లోడ్ చేసున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పోర్న్ వీడియో లను చూసేందుకు సబ్ స్క్రైబర్స్ నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంత మంది ఏజెంట్లు ద్వారా పోర్న్ చిత్రాల నిర్మాణానికి కెన్రిన్ నిధులు సమకూర్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అలాగే పోర్న్ చిత్రాల్లో నటించిన వారికి పారితోషకాలు ఇచ్చేందుకు రాజ్ కుంద్రా H అకౌంట్ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు. ఇప్పుడు రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఈ అశ్లీల రాకెట్ గుట్టు రట్టయింది. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసిన ముంబై క్రైమ్ పోలీసులు.. 7.5 కోట్లు సీజ్ చేశారని తెలుస్తోంది. ఇక రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Maha Samudram: కరోనా ఎఫెక్ట్.. శర్వానంద్ మహాసముద్రం సినిమా రిలీజ్ ఇప్పట్లో లేనట్టేనా..?

Shalini: సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న సఖి హీరోయిన్.. భారీ సినిమాలో కీలక పాత్రలో షాలిని.

Theaters Parking: ఇకపై థియేటర్ల వద్ద మళ్లీ పార్కింగ్ చార్జీలు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..