Theaters Parking: ఇకపై థియేటర్ల వద్ద మళ్లీ పార్కింగ్ చార్జీలు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..
Theaters Parking Telangana: కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు థియేటర్లు మూతపడడంతో వాటిపై ఆధారపడి జీవనం...
Theaters Parking Telangana: కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు థియేటర్లు మూతపడడంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, తెలంగాణలో లాక్‌డౌన్‌ను కూడా పూర్తి స్థాయిలో ఎత్తి వేయడంతో థియేటర్లు తిరిగి తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయ తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాణ చివరి దశలో ఉన్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇన్ని నెలలపాటు తీవ్రంగా నష్టపోయిన థియేటర్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక రాష్ట్రంలో సినిమా థియేటర్ల వద్ద పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం 2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ జీవో నెంబర్ 63ను జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా నష్టాన్ని పూడ్చడంలో భాగంగా ప్రభుత్వం ఈ జీవోను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే వర్తిస్తాయి. మల్టీఫ్లెక్సులు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో ప్రజల నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొంది. తక్షణమే ఈ రూల్స్ అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: Leopard : మెదక్ జిల్లాలో చనిపోయిన చిరుతకి పోస్ట్ మార్టమ్ పూర్తి.. అయినా కొలిక్కిరాని మిస్టరీ.!
YS Sharmila: ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన దీక్షలో వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్