YS Sharmila: ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన దీక్షలో వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్
రాష్ట్రంలో ఒక లక్షా తొంభై వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ..
YS Sharmila : రాష్ట్రంలో ఒక లక్షా తొంభై వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్‌టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పిన ఆమె, దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ‘దున్నపోతు మీద వాన పడినట్లుంది ఈ కేసీఆర్ ప్రభుత్వం’ అని ఆమె విమర్శించారు.
“తన ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఉన్నాయి.. ఈ రోజు మేము పోరాటాలు చేస్తున్నాము కాబట్టి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి వచ్చారు. నిరుద్యోగుల కొరకు మేము దీక్షలు చేస్తుంటే.. కేసీఆర్ కొడుకు వ్రతాలు చేస్తున్నాము అని కామెంట్ చేస్తున్నారు.” అని షర్మిల విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి బాత్రూంకు కూడా బుల్లెట్ ప్రూఫ్.. కానీ నిరుద్యోగులకు మాత్రం ఏమీ లేదని షర్మిల ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చి ఉంటే, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండేవి కావన్న ఆమె, వెంటనే లక్షా తొంభై వేల ఉద్యోగాలకు, నోటిఫికేషన్ వెంటనే విడుదల చెయ్యాలి.. ఇది నా డిమాండ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె, కేసీఆర్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్షలో భాగంగా షర్మిల ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఆత్మహత్య పాల్పడిన గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పలువురు నిరుద్యోగులతో ఈ సందర్భంగా ఆమె ఫోన్‌లో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Read also : Seethakka : ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే సీతక్క వార్నింగ్.. పోడు భూముల జోలికొస్తే..