Shalini: సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న సఖి హీరోయిన్.. భారీ సినిమాలో కీలక పాత్రలో షాలిని.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సఖి సినిమాతో ప్రేక్షకులను ఆకర్షించింది షాలిని. ఈ సినిమాతో షాలిని తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ మనసులను దోచేసింది.

Shalini: సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న సఖి హీరోయిన్.. భారీ సినిమాలో కీలక పాత్రలో షాలిని.
Shalini
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Jul 21, 2021 | 11:55 AM

Shalini: మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సఖి సినిమాతో ప్రేక్షకులను ఆకర్షించారు షాలిని. ఈ సినిమాతో షాలిని తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ మనసులను దోచేసింది. షాలిని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. అయితే ఆమె ఎక్కువగా తమిళ్ సినిమాల పైనే దృష్టి పెట్టారు. కెరీర్ పీక్ లో ఉండగానే స్టార్ హీరో అజిత్ ను పెళ్లాడింది షాలిని. పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా షాలిని వెండి తెరకు దూరంగా ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత షాలిని రీఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు సెంకండ్ ఇన్నింగ్స్ తో తిరిగి రాణించాలని చూస్తున్నారు షాలిని. ఈ క్రమంలోనే ఆమె ఓ భారీ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. .మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పొన్నియన్ సెల్వన్ అనే సినిమా లో షాలిని నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పలు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా ప్రాభవం తగ్గడంతో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో విక్రమ్.. ఐశ్వర్య రాయ్.. త్రిష.. జయం రవి.. శరత్ కుమార్.. జయరామ్.. విక్రమ్ ప్రభు.. అశ్విన్ కుమార్.. కిషోర్ ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రకోసం షాలిని కావాలని మణిరత్నం పట్టుబట్టడంతో ఆమె ఒప్పుకున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nabha Natesh: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఇస్మార్ట్‌ బ్యూటీ.. గోపీచంద్‌ కొత్త చిత్రంలో నభా నటేష్‌.?

Theaters Parking: ఇకపై థియేటర్ల వద్ద మళ్లీ పార్కింగ్ చార్జీలు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..

Needa AHA: ఆసక్తిని రేకెత్తిస్తోన్న నీడ ట్రైలర్‌.. ఆహాలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!