Nabha Natesh: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఇస్మార్ట్‌ బ్యూటీ.. గోపీచంద్‌ కొత్త చిత్రంలో నభా నటేష్‌.?

Nabha Natesh: గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. తనకు లౌక్యం, లక్ష్యం వంటి...

Nabha Natesh: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఇస్మార్ట్‌ బ్యూటీ.. గోపీచంద్‌ కొత్త చిత్రంలో నభా నటేష్‌.?
Nabha Natesh
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jul 21, 2021 | 9:16 AM

Nabha Natesh: గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. తనకు లౌక్యం, లక్ష్యం వంటి సూపర్ హిట్‌లను అందించిన శ్రీవాస్‌తో గోపీచంద్‌ మరోసారి చేతులు కలపడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి రోజూ ఏదో ఒక వార్త హల్చల్‌ చేస్తూనే ఉంది. ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ నటించనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో గోపీచంద్‌, రాజశేఖర్‌ అన్నతమ్ముళ్లుగా కనిపించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ మాత్రం స్పందించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త హల్చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన నభా నటేష్‌ నటించనుందనేది సదరు వార్త సారంశం. ఇస్మార్ట్ శంకర్‌ సినిమాకు ముందు పెద్దగా విజయాలను అందుకోని నభాకు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇస్మార్ట్‌ శంకర్‌లో తన అందం, అభినయంతో ఆకట్టుకుందీ చిన్నది. ఇక ప్రస్తుతం నితిన్ సరసన మాస్ట్రోలో నటిస్తోన్న నభాను గోపీచంద్‌ కొత్త సినిమా కోసం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే నభాను సంప్రదించగా దానికి తను కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్..! ఫేస్‌బుక్‌‌లో కోటి మంది ఫాలోవర్స్..

మెగాపవర్ స్టార్‌‌‌కు జోడీగా లక్కీ బ్యూటీ పేరు వినిపిస్తుందే.. శంకర్ సినిమాలో హీరోయిన్ ఆమేనా..

నీ అభిమానం చల్లగుండా.. సోనూసూద్ కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం..