Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్..! ఫేస్‌బుక్‌‌లో కోటి మంది ఫాలోవర్స్..

Vijay Devarakonda : రౌడీ బాయ్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరో సరికొత్త రికార్డును సొంతం

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్..! ఫేస్‌బుక్‌‌లో కోటి మంది ఫాలోవర్స్..
Vijay Devarakonda
Follow us
uppula Raju

|

Updated on: Jul 20, 2021 | 8:50 PM

Vijay Devarakonda : రౌడీ బాయ్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో కోటీ మంది ఫాలోవర్స్‌ను సంపాదించి మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌‌లో 1కోటీ 25 లక్షల మంది ఫాలోవర్స్ పైగా సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డులకెక్కాడు. దీనిని బట్టి విజయ్‌కి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే వరుస ఫ్లాపుల్లో ఉన్న తమ అభిమాన హీరో రౌడీ విజయ్ దేవరకొండకి ఈ సినిమాతో పూరి జగన్నాథ్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా 10 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంత చేసుకోవడంపై అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలో స్టార్ హీరోలకు తగ్గ క్రేజీ దక్కించుకున్న ఏకైక హీరో రౌడీ విజయ్ దేవరకొండ. “అర్జున్ రెడ్డి” సినిమా తో ఓవర్ నైట్ లోనే మంచి పాపులారిటీ సంపాదించాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్షన్, హీరోయిన్ తో చేసే రొమాన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు విజయ్ దేవరకొండ సౌత్ లో కూడా తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఫుల్ ఫ్లాపుల్లో ఉన్న విజయ్ గత కొన్ని రోజుల నుంచి చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అయినా అతడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

IND vs SL 2nd ODI Live: భారత్ లక్ష్యం 276 పరుగులు.. బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా..

రోడ్డుమీద చిరువ్యాపారులే అని చిన్నచూపు చూడకండి.. వారిలోను కోటీశ్వరులున్నారు.. అక్కడ 250మందికి పైగా కోటీశ్వరులే

Space Ticket Booking: రోదసి యాత్రకు మీరు రెడీనా.. టికెట్ బుక్కింగ్ మొదలైంది.. ధర ఎంతో తెలుసా..