AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen: అనుకోకుండా మంచి రోజులు వచ్చాయంటోన్న మెహ్రీన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సెడన్‌గా ప్రకటన..

Mehreen: నాని హీరోగా తెరకెక్కిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార మెహ్రీన్‌ తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళంలో...

Mehreen: అనుకోకుండా మంచి రోజులు వచ్చాయంటోన్న మెహ్రీన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సెడన్‌గా ప్రకటన..
Mehreen Latest
Narender Vaitla
|

Updated on: Jul 21, 2021 | 5:46 AM

Share

Mehreen: నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార మెహ్రీన్‌ తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లారు. అయితే ‘అశ్వథ్థామ’ తర్వాత మరే సినిమాలో నటించలేరు మెహ్రీన్‌. కేవలం ఎఫ్‌3 చిత్రంలో మాత్రమే నటిస్తోన్న మెహ్రీన్‌ ఇంకో కొత్త సినిమాకు సైన్‌ చేయలేదు. ఎఫ్‌3 కూడా కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇదే సమయంలో మెహ్రీన్‌కు హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. దీంతో వివాహం కోసమే మెహ్రీన్‌ సినిమాలకు ఓకే చెప్పలేదని చర్చ జరిగింది. అయితే వివాహ సమయం దగ్గర పడ్డ క్రమంలో తాను పెళ్లి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అని ప్రకటన చేశారు. మెహ్రీన్‌ ఈ విషయాన్ని అప్పట్లో తానే స్వయంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మెహ్రీన్‌ మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారు మెహ్రీన్‌. ఎలాంటి హడావుడి లేకుండా ఏకంగా కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేసేశారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మెహ్రీన్‌ సరసన కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌ నటిస్తున్నారు. సంతోష్‌ ఇటీవల వచ్చిన ‘ఏక్‌ మినీ కథ’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన మెహ్రీన్‌.. ‘మారుతి దర్శకత్వలంఓ అనుకోకుండా ఓకే అయిన సినిమా. త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే మారుతి ఇది వరకు దర్శకత్వం వహించిన ‘మహానుభావుడు’ చిత్రంలో మెహ్రీన్‌ నటించిన విషయం తెలిసిందే.

Also Read: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్..! ఫేస్‌బుక్‌‌లో కోటి మంది ఫాలోవర్స్..

Ajith Inspiring Story: ఇంటి అద్దె కట్టలేక బైక్ అమ్ముకున్న హీరో.. ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగిన వైనం

Raj Kundra Arrested: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు 23వరకు పోలీస్ కస్టడీ..