- Telugu News Photo Gallery Cinema photos Raj kundra whatsapp chats leaked reveals huge money was earned through films sherlyn chopra made complaint
Raj Kundra Arrested: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు 23వరకు పోలీస్ కస్టడీ..
ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ లో మరోసారి కలకలం రేగింది.
Updated on: Jul 20, 2021 | 5:58 PM

ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ లో మరోసారి కలకలం రేగింది.

రాజ్ కుంద్రాను పోర్న్ వీడియోలు తీయించి కొన్ని యాప్ల ద్వారా ప్రసారం చేసిన కేసులో ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

నటి షర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదైందని ముంబై పోలీసులు తెలిపారు.

రాజ్ కుంద్రాను 19/7/21 న అరెస్టుచేసిన పోలీసులు ఈకేసులో ఇతడే ముఖ్య కుట్రదారుడని.. దీనికి సంబంధించి తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

రాజ్ కుంద్రా కు సంబంధించిన వాట్సాప్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చాట్ లో పోర్న్ ఫిలిమ్స్ గురించి మిగిలిన వారితో చర్చించారు. పోర్న్ సినిమాలు ద్వారా రాజ్ చాలా సంపాదించాడని ఈ చాట్ చూస్తే తెలుస్తుంది. అలాగే పోర్న్ మూవీ మేకర్ కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ చైర్మన్ ప్రదీప్ బక్షితో డబ్బు లావాదేవీలు, కంటెంట్ పోస్టింగ్ గురించి కుంద్రా చర్చించారు.

తాజాగా రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది.




