AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ అభిమానం చల్లగుండా.. సోనూసూద్ కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం..

కరోనా కాలంలో.. కష్టాలు పడుతున్న పేద వారికి సాయంచేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోను సూద్. కరోనా సమయంలో సోను చేసిన సాయం అంత సులువుగా మరచిపోలేము..

నీ అభిమానం చల్లగుండా.. సోనూసూద్ కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం..
Sonusood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 20, 2021 | 4:55 PM

Sonu Sood: కరోనా కాలంలో.. కష్టాలు పడుతున్న పేద వారికి సాయంచేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోను సూద్. కరోనా సమయంలో సోను చేసిన సాయం అంత సులువుగా మరచిపోలేము. సోషల్ మీడియా వేదికగా సాయమడిగిన వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూ.. మంచి పేరు తెచ్చుకున్నారు కూడా…! ఇక సినిమా స్టార్‌ గా కంటే.. తన హెల్పింగ్ హ్యాండ్‌తోనే త్రూ అవుట్ పాపులర్ అయిన ఈ హీరో.. ప్రస్తుతం ప్రజల గుండెల్లో  దేవుడుగా మారిపోయాడు ఈ రియల్ హీరో. అభిమాన ఘణాన్ని పెంచుకుని.. అందరి వాడయ్యారు. అందుకే సోను ఇంటి వాకిలి ఎప్పుడూ అభిమానులతో కిక్కిరిసిపోతోంది. తనను చూసేందుకు… తాకేందుకు.. సాయమర్థించేందుకు వస్తున్న అభిమానుల అరుపులతో హొరెత్తిపోతోంది.

ఆయన చేసిన సేవలకు కొందరైతే గుడులు కట్టించి పూజలు కూడా చేస్తున్నారు. మరికొందరు వారికి పుట్టిన పిల్లలకు సోనూ సూద్ పేరు పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా సోనును చూసేందుకు ఓ అభిమాని క్రేజీ పని చేశారు. కేవలం సోను సూద్‌ను చూడాలనే కోరికతో …సైకిల్ యాత్ర చేపట్టారు. ఏకదాటిగా 1200 వందలు ప్రయాణించి చివరికి తన కోరికను నెరవేర్చుకున్నాడు.. ఆ క్రేజీ ఫ్యాన్‌. సోనూసూద్ ను కలిసి తాను చేసిన సైకిల్ జర్నీ గురించి వివరించాడు ఆ అభిమాని. పూరీ కి చెందిన సింబా అనే అభిమాని సైకిల్ పై 1200 కిలోమీటర్లు ప్రయాణించి ముంబైలో సోనూ సూద్ ను కలిశాడు. సింబా సోనూసూద్ కు పూలదండ వేయబోగా ఆయన ఆ పూలదండను అభిమాని మెడలోనే వేసారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Charmy Kaur: తండ్రిని కాకాపట్టడానికి ట్రైచేసి హీరోయిన్ ఛార్మి.. చివరకు ఏమైందో తెలుసా..

Mahesh Babu : నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను : మహేష్ బాబు

Mani Ratnam’s Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రస్టింగ్ అప్డేట్..