AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mani Ratnam’s Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రస్టింగ్ అప్డేట్.. 

సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం సినిమాలను ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమాలు హిట్ లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆయన సినిమాల్లో ఎదో 

Mani Ratnam's Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రస్టింగ్ అప్డేట్.. 
Ps1
Rajeev Rayala
|

Updated on: Jul 20, 2021 | 4:26 PM

Share

Mani Ratnam’s Ponniyin Selvan: సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమాలు హిట్ లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆయన సినిమాల్లో ఎదో తెలియని మాయ ఉంటుంది. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఇటీవలే చిత్రబృందం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ షెడ్యూల్ మధ్యప్రదేశ్ లో ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా పలు పార్టులుగా విడుదల కాబోతుంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమాను చూపించబోతున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. జీవితంలో అద్బుత ఘటం వచ్చిందంటూ ఈ పోస్టర్ ను మణిరత్నం షేర్ చేశారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో విక్రమ్.. ఐశ్వర్య రాయ్.. త్రిష.. జయం రవి.. శరత్ కుమార్.. జయరామ్.. విక్రమ్ ప్రభు.. అశ్విన్ కుమార్.. కిషోర్ ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటించబోతున్నారు. ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చబోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sharwanand : జోరుమీదున్న యంగ్ హీరో.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ మొదలు పెట్టిన శర్వా..

Corona Effect on Theatres: త్రిశంకు స్వర్గంలో తెలుగు సినీ పరిశ్రమ.. థియేటర్లపై సినిమా కష్టాలు..!

Sharwanand : జోరుమీదున్న యంగ్ హీరో.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ మొదలు పెట్టిన శర్వా..