Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushboo : ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. తమిళనాడు డీజీపీకి లిఖిత పూర్వక ఫిర్యాదు..

Kushboo : దేశంలోని పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలపై హ్యాకర్లు దాడి చేస్తున్నారు. తాజాగా బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్

Kushboo : ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. తమిళనాడు డీజీపీకి లిఖిత పూర్వక ఫిర్యాదు..
Kushboo
Follow us
uppula Raju

|

Updated on: Jul 20, 2021 | 5:18 PM

Kushboo : దేశంలోని పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలపై హ్యాకర్లు దాడి చేస్తున్నారు. తాజాగా బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్ అధికారిక ట్వీట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆమె ఓ ప్రకటనలో వెల్లడించారు. హ్యాక్ అయిన తర్వాత అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఖాతాలో డీపీ, ప్రొఫైల్ నేమ్ మార్చినట్టు చెప్పారు. ఈ అంశంపై తమిళనాడు డీజీపీని కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇక 2020 ఏప్రిల్ లో కూడా ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హాక్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అందులో తన పేరును బ్రియాన్ గా కూడా మార్చారు. ఆమె ఫోటోలను మార్చడమే కాకుండా తను పంచుకున్న ట్వీట్స్, పోస్టులన్నీ డిలీట్ చేశారు. ఇక తాజాగా కూడా ఇలా కావడంతో ఖుష్బూ తెగ టెన్షన్ పడుతుంది. ఖుష్బూ నే కాకుండా ఇది వరకు ఎంతోమంది సెలబ్రెటీల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాక్ చేశారు కొందరు హ్యాకర్లు. అంతేకాకుండా కొన్ని బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు. ఇక ఖుష్బూ ట్విట్టర్ హాక్ అవడంతో ఆమె అభిమానులు ఆమెకు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ధైర్యం ఇస్తున్నారు.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఖుష్బూ నిత్యం ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది. ఇక ట్విట్టర్ వేదికగా ఎన్నో ట్వీట్లు, పోస్టులు చేస్తూ ఉంటుంది. తెలుగులోనే కాకుండా తమిళ భాషలలో కూడా నటించి మంచి గుర్తింపు అందుకుంది. రాజకీయ నాయకురాలిగా బీజేపీ పార్టీలో చేరింది. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాన్ని చూసుకుంటుంది ఖుష్బూ.

VIRAL VIDEO : ఈ వీడియోలో గుర్రం వెనుకకు నడుస్తుందా.. ముందుకు నడుస్తుందా..! నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Bakrid 2021: రేపటి ‘ఈదుల్ జుహా’కు అంతా సిద్ధం.. బక్రీద్ ప్రాశస్త్యం ఏంటి..? ఖుర్బానీ మూడు వాటలెందుకు వేస్తారు..?

Mani Ratnam’s Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రస్టింగ్ అప్డేట్..