VIRAL VIDEO : ఈ వీడియోలో గుర్రం వెనుకకు నడుస్తుందా.. ముందుకు నడుస్తుందా..! నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
VIRAL VIDEO : కొన్నిసార్లు వింత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడతారు.
VIRAL VIDEO : కొన్నిసార్లు వింత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత వారు ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. వీటిని చూస్తే మీరు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక వీడియలో ఒక గుర్రం నడుస్తోంది కానీ అది ముందుకు నడుస్తుందా, వెనుకకు నడుస్తుందా అర్థంకాదు. ఈ విషయం మీరేమైనా తెలుసుకోగలరో ఒక్కసారి పరిశీలించండి.
ఈ వీడియోను @DattaDamayanti షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో గుర్రం ఏ మార్గంలో వెళుతుందో మీరు గమనిస్తే ఇలా చెప్పారు. గుర్రం ముందుకు వెళుతున్నట్లు అనిపిస్తే లెఫ్ట్ బ్రెయిన్ పర్సన్ అని, కుడివైపునకు వెళుతున్నట్లు అనిపిస్తే రైట్ బ్రెయిన్ పర్సన్ అని చెప్పారు. అయితే ఈ వీడియో చూసిన తరువాత చాలా మంది గుర్రం ముందుకు వెళుతోందని మొదట భావించారు కానీ దగ్గరగా చూస్తే అది వెనుకకు నడుస్తున్నట్లు అనిపిస్తుంది.
అటువంటి పరిస్థితిలో గుర్రం ఏ వైపునకు నడుస్తుందో అందరూ అయోమయంలో ఉన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే ప్రజలు దీనిపై వేగంగా స్పందించారు. గుర్రం ముందుకు నడుస్తుందా, వెనుకకు నడుస్తుందో నిర్ణయించడం అంత సులభం కాదని కొంతమంది అంటున్నారు. అయితే ఇది చాలా విచిత్రమైన వీడియో అని కొంతమంది చెబుతున్నారు. ఇందులో తుది నిర్ణయం తీసుకోవడం మాత్రం అంత సులభం కాదు.
దీని వెనుక ఏదైనా రీసెర్చ్ జరిగిందా అని ప్రజలు కామెంట్ చేస్తున్నారు. దీనికి సమాధానం మాత్రం తెలియలేదు. వీడియోలో మాత్రం గుర్రం వెనుకకు నడుస్తుందా ముందుకు నడుస్తుందా అనేది ఎవరు ఎటువంటి నిర్ణయానికి రాలేదు. ట్వీట్ ప్రకారం నెటిజన్ల కామెంట్స్‌ను, వీడియోను అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో ఒక ఫజిల్ మాదిరిగా ఉన్నట్లు కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి.
Which way is the #horse going, backward or forward? If you see it going forward you are likely to be a left-brained person (#analytical, logical and fact-oriented). You are right-brained if you see it going backward (#creative, #intuitive, a free thinker). pic.twitter.com/7pU8ADRxuM
— Damayanti Datta (@DattaDamayanti) July 19, 2021