Needa AHA: ఆసక్తిని రేకెత్తిస్తోన్న నీడ ట్రైలర్‌.. ఆహాలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌..

Needa AHA: ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ దూసుకొచ్చింది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'ఆహా'. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఎక్స్‌క్లూజివ్‌ ప్రొగ్రామ్స్‌ను డిజైన్‌ చేస్తూ...

Needa AHA: ఆసక్తిని రేకెత్తిస్తోన్న నీడ ట్రైలర్‌.. ఆహాలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌..
Needa Aha Movie
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jul 21, 2021 | 9:16 AM

Needa AHA: ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ దూసుకొచ్చింది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఎక్స్‌క్లూజివ్‌ ప్రొగ్రామ్స్‌ను డిజైన్‌ చేస్తూ డిజిటల్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో నయన తార నటించిన ‘నిజల్‌’ అనే చిత్రాన్ని తెలుగులో ‘నీడ’ పేరుతో ఆహాలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా జులై 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

ఇక ట్రైలర్‌ను గమనిస్తే.. నితిన్‌ అనే చిన్నారి చెప్పిన థ్రిల్లింగ్‌ కథ ఆధారంగా లాయర్‌ జాణ్‌ హత్య కేసును ఎలా చేధించాడు అన్న కథాంశంతో ఈ సినిమా కథ ఉన్నట్లు అర్థమవుతోంది. హత్య కేసును ఎదుర్కొనే సమయంలో లాయర్‌ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇంతకీ ఆ హత్యకు నయనతారకు ఏమైనా సంబంధం ఉందా.? అన్న ఆసక్తికర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పు ఎన్‌. భట్టతిరై దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన తార, కుంచాకో బోబన్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్ర ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Charmy Kaur: తండ్రిని కాకాపట్టడానికి ట్రైచేసిన హీరోయిన్ ఛార్మి.. చివరకు ఏమైందో తెలుసా..

Mani Ratnam’s Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రస్టింగ్ అప్డేట్.. 

Mahesh Babu : నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను : మహేష్ బాబు