AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra Arrest: భర్త రాజ్ కుంద్రా కేసులో శిల్పాశెట్టి పాత్ర ఉందా? క్లారిటీ ఇచ్చిన ముంబై పోలీసులు

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు పొర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో శిల్పా శెట్టి పాత్రపై ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

Raj Kundra Arrest: భర్త రాజ్ కుంద్రా కేసులో శిల్పాశెట్టి పాత్ర ఉందా? క్లారిటీ ఇచ్చిన ముంబై పోలీసులు
Raj Kundra Arrest Shilpa Shetty
Venkata Chari
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 21, 2021 | 11:37 AM

Share

Raj Kundra Arrest: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు పొర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మించి, పలు యాప్‌లలో విడుదల చేసినట్లు కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు.. ఫిబ్రవరిలో నమోదైన ఓ కేసులో ప్రధాన నిందితుడిగా రాజ్‌ కుంద్రాను సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలె తెలిపారు. కాగా, ఆయనకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నాడు. జులై 23 వరకు పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. నటీ నటులను బలవంతపెట్టి నగ్నంగా ఫొటోలు తీశారని, వాటిని పెయిడ్‌ మొబైల్‌ యాప్స్‌కు అమ్మే  9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. అయితే, ఈ విషయంలో నటి శిల్పాశెట్టి హస్తముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో శిల్పా శెట్టి ప్రమేయం ఉన్నట్లుగా ఇంతవరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని జాయింట్ కమిషనర్ మిలింద్ భరంజే తెలిపారు. మరితం లోతుగా విచారించిన తరువాత ఆమె పాత్ర ఉంటే కచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటామని అన్నారు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తీసిన వీడియోలు లండన్‌కు చెందిన హాట్‌షాట్స్ అనే యాప్‌లో అప్‌లోడ్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కోర్టు అనుమతి తీసుకుని రాజ్ కుంద్రా ఆఫీసులో సోదాలు నిర్వహించామని, అక్కడ కొన్ని క్లిప్పులు దొరికాయని, దీంతో రాజ్ కుంద్రాతోపాటు ఆయన ఐటీ ఆఫీసర్‌ను అరెస్టు చేశామని ఆయన అన్నారు.

Also Read:

Jammu Drone: జమ్ము కశ్మీర్‌లో మరోసారి డ్రోన్ కలకలం.. ఆరా తీస్తున్న భద్రతాధికారులు

Operation Mate Carlo: ‘ఆపరేషన్‌ మాంటె కార్లో’.. గుట్టురట్టవుతున్న విదేశీ కార్ల స్కామ్.. బయటపడుతున్న హైదరాబాదీ ప్రముఖుల పేర్లు..!