షూటింగ్ సమయంలో చిరంజీవి నాపై అరిచాడు.. అసలు కారణం అదే.. ఆసక్తికర విషయాలను చెప్పిన అన్నపూర్ణ..

తెలుగులో దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుంచి సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు సీనియర్ నటి అన్నపూర్ణ.

షూటింగ్ సమయంలో చిరంజీవి నాపై అరిచాడు.. అసలు కారణం అదే.. ఆసక్తికర విషయాలను చెప్పిన అన్నపూర్ణ..
Annapurna

తెలుగులో దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుంచి సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు సీనియర్ నటి అన్నపూర్ణ. అప్పటి స్టార్ హీరోల నుంచి.. ప్రస్తుత హీరోల వరకు అమ్మగా.. బామ్మగా.. నటిస్తున్నారు అన్నపూర్ణ. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా.. కామెడీ పాత్రలలోనూ అన్నపూర్ణ ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఓ ఛానెల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నపూర్ణ.. తన సినిమాల విషయాలు మాత్రమే కాకుండా. తన వ్యక్తిగత విషయాల గురించి.. కూతురు మరణం గురించి కూడా అనేక విషయాలను బయటపెట్టింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో తనతో అందరూ ఎంతో సరదాగా మాట్లాడతారని చెప్పుకొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ప్రతి ఒక్క స్టార్ ఎంతో సపోర్ట్‎గా ఉంటారని తెలిపింది. ఇండస్ట్రీలో చాలా మందిని వరుసలు పెట్టి అంటే.. మరిది.. బావ.. మామయ్య ఇలా పిలుస్తానని తెలిపారు అన్నపూర్ణ. ఇక చిరంజీవి, బాలకృష్ణలతో ఎన్నో సినిమాల్లో కలిసి నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ సమయంలో నాపై అరిచారు అంటూ చెప్పుకొచ్చారు అన్నపూర్ణ.

షూటింగ్ సమయంలో మన డైలాగ్స్ గుర్తుపెట్టుకుంటూ.. యాక్షన్ కోసం సిద్ధమయ్యే కంగారులో ఉంటాం. అయితే ఓ సినిమా షూట్ కోసం నేను చిరంజీవి సెట్‏లో ఉన్నాం. చిరంజీవి.. అక్కడే నువ్వు లైట్ చూసుకోవా అంటూ నాపై అరిచాడు. ఎందుకంటే అప్పుడు నేను నీడలో నిలబడి ఉన్నాను. చీకటిగా కనిపించడంతో ఆయన నా మంచి కోరే అలా అన్నాడు. వెంటనే నేను మాట్లాడుతూ.. నువ్వు ఉన్నావు కదా అందుకే అలా పక్కకు ఉన్నాను అని చెప్పాను. నేను ఉంటే నువ్వు లైట్ చూసుకోకుండా పక్కకు నిలబడతావా అంటూ చిరంజీవి మాట్లాడారని.. నాకు తెలియలేదులే అబ్బాయ్ చికట్లో నిలబడ్డానా మరి ఎక్కడ నిలబడను అని నేను సమాధానమిచ్చానని అన్నపూర్ణ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిరంజీవిని ఎప్పుడైనా అబ్బాయి అంటాను. బాలకృష్ణను మాత్రం బాల బాబు అని పిలుస్తానని చెప్పుకొచ్చారు అన్నపూర్ణ.

కృష్ణగారిని మాత్రం అబ్బాయి అనను అని తెలిపారు. బాలకృష్ణ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు కొడుకుగా నటించాడు. అందుకే అప్పటి బాలయ్య ఇప్పుడు నాకు కనిపిస్తాడు. అందుకే నేను బాలయ్యను ఇప్పటికీ బాల బాబు అని పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Samantha Akkineni: మీరు లేకుండా జీవితం ఒకేలా ఉండదు.. ఫ్రెండ్‏తో కలిసి నైట్ పార్టీలో నవ్వులు చిందిస్తున్న సామ్.. ఫోటో వైరల్.

RRR Movie: “ఆర్ఆర్ఆర్” మూవీ కోసం జక్కన్న నయా ప్లాన్.. రంగంలోకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..