AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deeapm: డాక్టర్‌బాబు యాక్షన్‌కు చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా అభిమానే.. కొడుకులా చూస్తారంటున్న కార్తీక్‌బాబు

Karthika Deeapm: బుల్లి తెర నటుడు నిరుపమ్ పరిటాల అంటే వెంటనే ఎవరికైనా గుర్తుకొస్తాడో లేడో కానీ.. డాక్టర్ బాబు అనగానే బుల్లి తెర ప్రేక్షకులకు వెంటనే గుర్తుకొస్తాడు. అవును వెండి తెరపై..

Karthika Deeapm: డాక్టర్‌బాబు యాక్షన్‌కు చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా అభిమానే.. కొడుకులా చూస్తారంటున్న కార్తీక్‌బాబు
Doctobabu
Surya Kala
|

Updated on: Jul 23, 2021 | 7:04 PM

Share

Karthika Deeapm: బుల్లి తెర నటుడు నిరుపమ్ పరిటాల అంటే వెంటనే ఎవరికైనా గుర్తుకొస్తాడో లేడో కానీ.. డాక్టర్ బాబు అనగానే బుల్లి తెర ప్రేక్షకులకు వెంటనే గుర్తుకొస్తాడు. అవును వెండి తెరపై విలన్ గా అడుగుపెట్టినా సరైన గుర్తింపు రాకపోవడంతో బుల్లి తెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చంద్రముఖి , కార్తీక దీపం వంటి సీరియల్స్ నటుడుగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నిరుపమ్ తండ్రి ఓం కార్ రచయిత, నటుడు.. అయితే నిజానికి ఓం కార్ తన కొడుకు ఎప్పుడు నటుడు అవ్వాలని కోరుకోలేదు.. ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకున్నాడు.. అయితే నిరుపమ్ కు నటన అంటే ఉన్న ఆసక్తితో ఈ రంగంలో అడుగు పెట్టాడు.. అయితే నిరుపమ్ కు తండ్రి నుంచి నటనే కాదు రచన కూడా వారసత్వంగా వచ్చింది. నెక్స్ట్ నువ్వే సినిమాలకు మాటలను రాశాడు డాక్టర్ బాబు. ఇక నిర్మాతగా మారి హిట్లర్ పెళ్ళాం సీరియల ను నిర్మిస్తున్నాడు. మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో కూడా నటించాలని చూపిస్తున్నాడు ఈ కార్తీక్ బాబు.

దాదాపు 10సీరియల్స్ కు పైగా నటించిన నిరుపమ్ కు కార్తీక దీపంలోని డాక్టర్ బాబు క్యారెక్టర్ మంచి గుర్తింపు తెచ్చింది. ఎంతగా అంటే .. సీరియల్‌లో క్యారెక్టర్ పేరు కార్తీక్ కంటే… డాక్టర్ బాబుగానే ఫేమస్.. మరి ఈ డాకర్ బాబుగా నిరూపమ్ నటనకు సామాన్యులే కాదు.. రాజకీయ నాయకులు, సినీమా నటీనటులు కూడా ఫ్యాన్స్.. కార్తీక్ పాత్రలో నటనకు గాను బ్రహ్మనందం ఫోన్ చేసి మరీ ప్రశంసలు కురిపించారు. ఇక వెండి తెరపై దాదాపు క్రికెట్ సభ్యులంతమంది హీరోలున్న మెగా మదర్ అంజనాదేవి కూడా నిరుపమ్ కు పెద్ద ఫ్యాన్.. తన అభిమానాన్ని నిరుపమ్ కు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి స్పెషల్ గా తెలియజేస్తారట..ప్రతి వేసవికి నిరుపమ్ కు అంజనాదేవి మామిడిపళ్ళను పంపిస్తారు. తనను అంజనాదేవిగారు సొంత కొడుకులా చూస్తారని నిరుపమ్ తన సంతోషాన్ని అందరితోనూ పంచుకున్నాడు.

Also Read:  Chocolate Butter Cookies: బేకరీ స్టైల్ లో ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ బట్టర్ కుకీస్ తయారీ విధానం..