Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!

Karthika Deepam1099 Episode: ఒక డాక్టర్ బాబు..ఒక వంటలక్క మధ్యలో మోనిత! వీరి ముగ్గురి మధ్యలో ఇద్దరు పిల్లలు.. కుటుంబ మర్యాదలు.. తెలుగు ప్రజల మనసును దోచుకున్న కార్తీకదీపం సీరియల్ 1099 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో..

Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!
Karthika Deepam Latest
Follow us
KVD Varma

|

Updated on: Jul 23, 2021 | 7:55 AM

Karthika Deepam1099 Episode: ఒక డాక్టర్ బాబు..ఒక వంటలక్క మధ్యలో మోనిత! వీరి ముగ్గురి మధ్యలో ఇద్దరు పిల్లలు.. కుటుంబ మర్యాదలు.. వెయ్యికి పైగా ఎపిసోడ్లు.. తెలుగు ప్రజల మనసును దోచుకున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్థానం ఇది. తెలుగు టీవీ సీరియల్ పరంపరలో చాలా సీరియళ్లు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో కొన్ని సీరియళ్లు ప్రజల మనసుల్ని దోచేశాయి. ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. ఇప్పటికే 1098 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న కార్తీకదీపం ఇప్పుడు 1099 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగబోతోందో ఇప్పుడు చూద్దాం..

నిన్నటి (1098) ఎపిసోడ్ లో ఏమైందంటే..

కార్తీక్, దీప లు ఉన్న ఇంటిదగ్గరకు అర్ధరాత్రి మోనిత వచ్చి అల్లరి చేయడానికి ప్రయత్నిస్తుంది. దీప ఆమెకు గట్టిగా బుద్ధిచెప్పి నీళ్లు తాగించి పంపిస్తుంది. దీంతో రగిలిపోయిన మోనిత ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటుంది. ఈ లోపు కార్తీక్ తండ్రి ఆనందరావు మోనితను కలవాలని ఫోన్ చేస్తాడు. మోనిత ఈ విషయాన్ని కార్తీక్ కు చెప్పి ఆనందరావును కలవడం కోసం వెళుతుంది. మరి ఆనందరావు మోనిత మధ్య ఏమి జరిగింది. కార్తీక్, దీప ఏం చేస్తారు? ఇవన్నీ ఈరోజు (1099) ఎపిసోడ్ లో.. మరి ఏం జరిగిందో తెలుసుకుందాం..

నేనూ వస్తాను…

మోనిత నుంచి ఫోన్ అందుకున్న కార్తీక్ కంగారు పడతాడు. ఏమైంది అంటూ దీప కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది. మోనిత ఫోన్ లో చెప్పిన విషయాన్ని చెబుతాడు కార్తీక్. తాను రిజిస్టర్ ఆఫీస్ కు వెళతానని చెబుతాడు. దీప తాను కూడా వస్తానని అడుగుతుంది. వద్దు దీపా.. అక్కడ గొడవ జరిగితే ఇబ్బంది అవుతుంది.. అంటాడు కార్తీక్. దీంతో దీప ” ఇంతకంటే ఇంకేం అల్లరి అవుతుంది. ఫర్వాలేదు. నేను వస్తాను డాక్టర్ బాబు.” అని చెబుతుంది. సరే అని ఇద్దరూ రిజిస్టర్ ఆఫీస్ కు బయలుదేరుతారు.

ఆనందరావుకు నిజం చెప్పిన మోనిత!

ఆనందరావును కలవడానికి మోనిత రిజిస్టర్ ఆఫీస్ వద్దకు వెళుతుంది. కారు దిగుతూ ఆనందరావును చూస్తూనే మోనిత కొద్దిగా భయపడుతుంది. వెంటనే.. తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది. ”నేను మోనితను. ఎవరికీ భయపడను. ఎవరికీ మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.” అనుకుంటూ ఆనందరావు వద్దకు వెళుతుంది. వెళుతూనే.. నమస్కారం మావయ్య గారూ.. అని పలకరిస్తుంది. వెంటనే, ఆనందరావు ”అంకుల్ ను మావయ్యా అని పిలిచినంత తేలికగా కొడుకు స్నేహితురాలు కోడలిగా మారలేదు.” అంటాడు. చూడమ్మా .. ”నేను ఆనందరావును.. వయసు.. అనుభవం..సమాజంలో పరువు ప్రతిష్టలు ఉన్న వాడిని. నువ్వు ఒక డాక్టర్ వి నీకు సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. మరి ఇదేమిటమ్మా” అంటాడు. ”అందులో ఉంది కదా అంకుల్.. మీరు కోరుకున్నట్టు అంకుల్ అనే పిలుస్తాను.. ఎందుకంటే.. ఒక కోడలు మావయ్యా అని.. ఇంకో కోడలు అంకుల్ అని పిలిస్తే వెరైటీగానూ ఉంటుంది. వేరియేషన్ కూడా ఉంటుంది. డాక్టర్ గా నేను అంకుల్ అనీ.. వంటలక్క మావయ్య అని పిలిస్తే నా స్థాయికి తగ్గట్టుగానూ ఉంటుంది అంటూ చెబుతుంది. ఒక డాక్టర్ కోడలుగా వస్తే మీ గౌరవం మరింత పెరుగుతుంది అంటుంది.” మోనిత.

దీంతో ఆనందరావు కోపంగా ”వద్దమ్మా.. నాకు ఇటువంటి అనైతికమైన గౌరవం అవసరం లేదు. ”అంటాడు. ”నేను మీ అనుమతి అడగలేదు అంకుల్. ఇంకా చెప్పాలంటే కనీసం మీకు సమాచారం కూడా ఇవ్వలేదు. మా అత్తయ్య అదే ది గ్రేట్ సౌందర్య ఆంటీయే ఏమీ చేయలేక.. అమెరికా వెళ్ళిపోయింది. పోనీలెండి. మీరు వచ్చారు. ఇప్పుడు మీరు, వంటలక్క మా పెళ్ళికి సాక్షి సంతాకాలు పెడుదురు గాని అంటుంది. దీంతో ఆనందరావు నువ్వు చేస్తున్న పని తప్పు అంటూ మందలిస్తాడు. కానీ, మోనిత ఎక్కడా వెనక్కి తగ్గదు. 25వ తేదీన అన్ని విషయాలు సరి అయిపోతాయి అంకుల్ అంటూ చెబుతుంది. దీంతో తేదీతో విషయాలు మారవు అని ఆనందరావు అంటాడు. మోనిత చివరికి ”నాకు మీరు ఫోన్ చేసినపుడే మీరు ఇలా మాట్లాడుతారని ఊహించాను. అయితే, మీరు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. నేను ఇప్పుడు గర్భవతిని. దీనికి కారణం మీ కొడుకు కార్తీక్. మీరు మళ్ళీ తాతయ్య కాబోతున్నారు. అందుకే పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను.  అంటూ అసలు విషయం చెప్పేస్తుంది.

ఆనందరావుకు హార్ట్ ఎటాక్..

మోనిత సరిగ్గా ఈ మాట చెప్పే సమయానికి కార్తీక్, దీప అక్కడికి వస్తారు.  మరోవైపు మోనిత ఈ విషయం చెప్పి.. వన్.. టూ..త్రీ అని లెక్కపెడుతుంది.. ఆమె త్రీ అని  లెక్క పెట్టె సమయానికి  ఆనందరావు ఒక్కసారిగా గుండె పట్టుకుని తూలిపోబోతాడు. దీప, కార్తీక్ అతన్ని పడిపోకుండా పట్టుకుంటారు. దీంతో ఆనందరావు కార్తీక్ చేయి విదిలించుతాడు. ఛీ.. నువ్వు నన్ను ముట్టుకోకు అంటూ దూరంగా నెట్టేస్తాడు. బాధతో విలవిల లాడుతూనే.. కార్తీక్ ను తీవ్రంగా ద్వేషిస్తాడు. ”నువ్వు చేసిన పనికి నేను బతకడం అనవసరం అంటాడు. ఈ పాపం చూడలేక మీ అమ్మ అమెరికా వెళ్ళిపోయింది. ఒకవేళ నేను చనిపోతే, ఈ కబురు మీ అమ్మకు చెప్పకండి. ఎందుకంటే, అక్కడ ఆమె గూండాగి చచ్చిపోతుంది. నేను చచ్చిపోయినా నన్ను నువ్వు తాకొద్దు.” అంటూ గట్టిగా చెబుతాడు. కార్తీక్ దీంతో నిలబడిపోతాడు. ఈలోపు దీప మీరు ఉండండి మావయ్యా.. మోనిత నాటకం ఆడుతోంది. ఈ డ్రామాను నేను బయటపెడతాను. మీరు ఆందోళన పడవద్దు అంటూ ఊరడించే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆనందరావు.. ”నువ్వు మామూలు ఆడదానివి కాదు దీపా.. నీకు చేతులెత్తి దణ్ణం పెట్టాలి అంటాడు.” ఈ గందరగోళం మధ్య మోనిత వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది.

అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారు..

కార్తీక్ దీప ఇంటిదగ్గర కనిపించకపోవడంతో సౌర్య, హిమ కంగారు పడతారు. ఎక్కడికి వెళ్లారని చర్చించుకుంటారు. చెప్పకుండా ఎక్కడి వెళ్లారు. ఈ మధ్య అమ్మానాన్నా చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఏం అయివుంటుంది అంటూ కంగారు పడతారు.

ఈ సమస్య ఎప్పటికి తీరేనో..

మరోవైపు భాగ్యం చిన్న కూతురితో మాట్లాడుతూ ఉంటుంది. మోనిత కార్తీక్ విషయం ఇద్దరూ మాట్లాడుకుంటారు. తనకు ఈ విషయంలో కంగారుగా ఉంది అంటూ భాగ్యం చెబుతుంది. ఈలోపు వాళ్లకు ఫోన్ వస్తుంది. ఆనందరావు ఆసుపత్రిలో చేరినట్టు వాళ్లకు తెలుస్తుంది. దీంతో హడావుడిగా పరిగెత్తుతూ ఆసుపత్రికి వెళతారు.

నేను చచ్చిపోయినా ఫర్వాలేదు..

ఆసుపత్రిలో ఆనందరావుకు ట్రీట్ మెంట్ ఇవ్వడానికి కార్తీక్ ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, కార్తీక్ ను ఆనందరావు వారిస్తాడు. ఆక్సిజన్ పైప్ తీసేసి.. ”నువ్వు అసలు నన్ను నీ ఆసుపత్రికి ఎందుకు తీసుకువచ్చావు. నేను చచ్చిపోయినా ఫర్వాలేదు. జీవితాంతం నువ్వు నన్ను చంపానని కుమిలిపోవాలి. నాకు నువ్వు ట్రీట్ మెంట్ ఇవ్వడానికి వీలులేదు.” అంటాడు. కార్తీక్ నాన్నా నా మాట వినండి అని ఎదో చెప్పబోతున్నా ఆనందరావు వినడు. ”చూడూ..నువ్వు చేసిన పాపాలు చెబితే నా పరువే పోతుంది. అంటూ ఈసడించుకుంటాడు.” దీంతో కార్తీక్ సిస్టర్ కు డాక్టర్ వర్మను పిలవమని చెప్పి నిస్సహాయంగా బయటకు వచ్చేస్తాడు. బయట దీప, భాగ్యం కంగారు పడుతూ ఏమైంది అని అడుగుతారు. కార్తీక్ సమాధానం చెప్పాడు. ఈలోపు డాక్టర్ వర్మ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి వస్తాడు.

ఈ టైం లో అంజి ఉంటె బావుండేది..

ఈరోజు ఎపిసోడ్ ఆనందరావుకు ట్రీట్ మెంట్ ఇవ్వడం మొదలవడంతో అయిపొయింది. ఇక రేపటి 1100 ఎపిసోడ్ లో సీన్ అదిరిపోయేలా కనిపిస్తోంది. ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న కార్తీక్, దీపల దగ్గరకు మోనిత వస్తుంది. కార్తీక్ చేయిపట్టుకుని అరగంట పని ఉంది నాతొ రా అంటుంది. దీంతో ఒళ్ళు మండిన కార్తీక్.”నేను రాను. నేను ఇదివరకటి కార్తీక్ అనుకుంటున్నావా నీ వెంట రావడానికి..” అని కోపంగా చెబుతాడు. దీంతో దీప వెళ్ళండి డాక్టర్ బాబు.. 25న జరగబోయే పెళ్లిపనులు చేసుకోవాలేమో. తాను జరగబోయే పెళ్లి పనుల కోసం మిమ్మల్ని పిలుస్తోంది. ఈ లోపు నేను ఆ పెళ్లి పెటాకులు చేయడానికి నా పనులు నేను చేసుకుంటాను.. అయినా ఈ టైం లో అంజి ఉంటె బావుంటుంది.. అంజిని మళ్ళీ పిలుద్దాం డాక్టర్ బాబూ అంటుంది. దీంతో మోనిత షాక్ తింటుంది. ఈ ప్రోమో చూస్తే రేపటి ఎపిసోడ్ లో దీప మోనిత పని పట్టేలా కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?

Also Read: Karthika Deepam July 22 Episode: మా ఆయన సాఫ్ట్ వేర్.. నేను హార్డ్ వేర్.. మోనిత చేత నీళ్ళు తాగించిన దీప!

Ariyana: అభిమానులకు షాకిచ్చిన అరియానా.. వెంటిలేటర్ పై అలా.. వీడియో షేర్ చేసిన ‏బిగ్‏బాస్ బ్యూటీ..