Actress Savitri: తెలుగులోనే కాదు హాలీవుడ్ సినిమాల్లో నటించిన మహానటి సావిత్రి వారసుడు.. ఎవరో తెలుసా

Actress Savitri: భారత చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో చెరగని ముద్ర వేసుకున్న సావిత్రి జీవితంలో ఎన్నో మలుపులు..ఎత్తుపల్లాలు. "కనులతోనే పాత్రల్లో నటించి..

  • Publish Date - 6:47 pm, Thu, 22 July 21
Actress Savitri: తెలుగులోనే కాదు హాలీవుడ్ సినిమాల్లో నటించిన మహానటి సావిత్రి వారసుడు.. ఎవరో తెలుసా
Savitri Grandson

Actress Savitri: భారత చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో చెరగని ముద్ర వేసుకున్న సావిత్రి జీవితంలో ఎన్నో మలుపులు..ఎత్తుపల్లాలు. “కనులతోనే పాత్రల్లో నటించి ఆ పాత్రల్లో జీవించి సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి. సావిత్రి జీవితం.. ఆమె ధరించిన ఏ పాత్రకూ తీసిపోదు. తారాజువ్వలా తారామండలానికి ఎగిసి, మితిమీరిన బోళాతనంతో తోకచుక్కలా రాలి, రోగగ్రస్తమై చివరి దశలో అనేక కష్టాలు పడి జీవన రంగస్థలి నుండి నిష్క్రమించిన తారామని. సావిత్రి తమిళ నటుడు జెమిని గణేషన్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు సతీష్, విజయ చాముండేశ్వరి ఇద్దరు పిల్లలు. అయితే సావిత్రి వారసులుగా కూతురు , కొడుకు సినిమాలపై ఆసక్తి చూపించలేదు.. అయితే సావిత్రి కుమార్తె చాముండేశ్వరి మాత్రం ఒక సీరియల్ లో నటించింది అలరించింది.. ఇక చాముండేశ్వరి రెండో తనయుడు అభినయ్ మాత్రం వెండితెరపై అడుగు హీరోగాఎంట్రీ ఇచ్చాడు.

సావిత్రి కుమారుడు సతీష్ అసలు నటనపై ఆసక్తి కనబరచలేదు.. కానీ సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాత్రం బుల్లితెరపై నటిగా అడుగు పెట్టినా సక్సెస్ అందుకోలేదు.. అయితే ఆమె రెండో కుమారుడు అభినయ్ మాత్రం సావిత్రి వారసుడిగా తన నటనతో ప్రముఖుల మన్ననలు అందుకున్నాడు. అయితే అతను సావిత్రి మనువడు అనే సంగతి చాలా మందికి తెలియదు..

తన అమ్మమ్మ కి నటవారసుడిగా మారతానంటూ వెండి తెరపై అడుగు పెట్టాడు. అప్పట్లో దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన “యంగ్ ఇండియా” సినిమాతో తెరం గ్రేటం చేశాడు అభినయ్. చిన్నప్పటి నుంచి క్రీడాకారుడు.. టేబుల్ టెన్నిస్ లో తమిళనాడు స్టేట్ తరపున పాల్గొన్నాడు. చెన్నై లో బీకాం చదివి అనంతరం యూకే కి ఉన్నత చదువు నిమిత్తం వెళ్లి.. అక్కడ ఎమ్మెస్ కంప్లీట్ చేశారు.. అక్కడ చదువుతున్న సమయంలో తన అమ్మమ్మ సావిత్రి కి ఉన్న పేరు.. ఆమె గొప్పతనం తెలిసింది. అంతేకాదు.. సావిత్రి తన వారసులు సినీ ఇండస్ట్రీలో ఉండాలని కోరుకున్నారని విషయం అర్ధం చేసుకున్న అభినయ్.. దృష్టి సినిమాలపై పడింది.

అదే సమయంలో దాసరి గారు యంగ్ ఇండియా సినిమా కోసం నూతన నటీనటుల కోసం అన్వేషణ అనే ప్రకటన చేశారు.. ఆ ప్రకటన చూసిన అభినయ్.. తండ్రి ప్రయత్నం చేయమని చెప్పారు. తాను ఎవరో చెప్పకుండా దాసరి సినిమాకు ఎంపికయ్యారు.. తనను ఎంపిక చేసిన తర్వాతనే దాసరికి తాను సావిత్రి మనవడిని అనే విషయం తెలిసిందని ఓ సందర్భంలో అభినయ్ చెప్పాడు. అంతేకాదు తాను ఎప్పుడు ఏ సందర్భం లోనూ తన అమ్మమ్మ పేరు చెప్పి.. గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోలేదని అభినయ్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు.

అంతేకాదు.. సినిమాల్లో నటించడానికి ముందు రజనికాంత్, కమల్ హసన్ లను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లు అభినయ్ చెప్పాడు.. రజని సర్ అయితే ఎక్కడా నటన కోర్సులో జాయిన్ అవ్వద్దు.. నటన నీ రక్తంలోనే ఉంది.. అని చెప్పారు. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్, మంచు మనోజ్ లు అభినయ్ కు మంచి ఫ్రెండ్స్. తనకు అమ్మమ్మ సావిత్రి పేరు, తాతగారు జెమిని గణేషన్ పేరుతో గాని అవకాశాలు సంపాదించుకోవాలని లేదని పలు సందర్భాల్లో చెప్పాడు. పెద్దమ్మ రేఖ తో మంచి రిలేషన్ ఉన్న అభినయ్ కోలీవుడ్ లో కొన్ని సినిమాలతో పాటు.. హాలీవుడ్ లో కూడా నటించాడు. భారత్ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ బయో పిక్ లో అభినయ్ నటించాడు. తన నటనతో దేశ విదేశీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.. తెలుగులో మంచి నటుడుగా పేరు తెచ్చుకుని అమ్మమ్మ నట వారసుడిగా రాణించాలని ఉందన్న అభినయ్ కు సరైన అవకాశాలు రాక కొద్డికాలంలోనే తెరమరుగయ్యాడని చెప్పవచ్చు.

Also Read:  వంద రోగాలకు ఒక్కటే ఔషధం త్రిఫల చూర్ణం…దీనిని ఎవరు, ఎలా ఉపయోగించాలంటే