Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: ‘ఆంధ్రాలో ఆక్సిజన్ ప్లాంట్‌‌‌‌‌ను ప్రారంభించబోయేది ఆమే’ .. నువ్వు సూపర్ సోనూ భయ్యా !

నెల్లూరు జిల్లా కావ‌లికి చెందిన బొడ్డు నాగ‌ల‌క్ష్మి గురించి రెండు నెల‌ల క్రితం వ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఆమె సేవా గుణం గురించి బాలీవుడ్ ..

Sonu Sood: 'ఆంధ్రాలో ఆక్సిజన్ ప్లాంట్‌‌‌‌‌ను ప్రారంభించబోయేది ఆమే' .. నువ్వు సూపర్ సోనూ భయ్యా !
Sonu Sood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 22, 2021 | 6:49 PM

Sonu Sood: నెల్లూరు జిల్లా కావ‌లికి చెందిన బొడ్డు నాగ‌ల‌క్ష్మి గురించి రెండు నెల‌ల క్రితం వ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఆమె సేవా గుణం గురించి బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ చేసిన ట్వీట్‌తో దేశ‌మంతా నాగ‌ల‌క్ష్మి గుర్తింపు పొందారు. ఇక తాజాగా నాగ‌ల‌క్ష్మి సేవా ఫ‌లాన్ని అందుకునే మంచి రోజు రానే వ‌చ్చింది. ఆత్మ‌కూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో సోనూసూద్ ఫౌండేషన్ స‌హ‌కారంతో నెల‌కొల్పిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను నాగ‌ల‌క్ష్మి చేతుల మీదుగా ప్రారంభించ‌నున్నారు. 23న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఆక్సిజన్ ప్లాంట్ ను నాగ లక్ష్మీ ప్రారంభించనున్నారు. ఈ విష‌యాన్ని సోనూసూదే, సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో మరోసారి వార్తల్లో నిలిచారు నాగలక్ష్మి.

ఏపీలోని కావలికి చెందిన అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి.. కరోనా సమయంలో సోనూ ఫౌండేషన్‌కి 15వేల విరాళంగా అందజేసింది. అయితే విరాళంగా ఇచ్చిన ఆ డబ్బు.. తన ఐదు నెలల పెన్షన్ కావటం విశేషం. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూసూద్‌ ఓ బాలీవుడ్‌ షోలో భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన సోనూసూద్ తన దృష్టిలో నాగలక్ష్మి రిచెస్ట్ ఇండియన్‌గా అభివర్ణించారు. అంతే కాదు ఒకరి బాధను చూడటానికి కంటిచూపు అవసరం లేదని నాగలక్ష్మి నిరూపించారని ప్రశంసించారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Suriya 40 First Look: అదిరిపోయిన సూర్య నయా లుక్.. ఫ్యాన్స్ కు పూనకాలే..

Ritika Singh: నీటిలో పడిపోయిన రితిక సింగ్‌..!! ముద్దుగా ఉన్నావ్ అంటూ కామెంట్స్.. వీడియో

Locked Season 2: మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న `ఆహా`