Suriya 40 First Look: అదిరిపోయిన సూర్య నయా లుక్.. ఫ్యాన్స్ కు పూనకాలే..

విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో సూర్య. ఇటీవలే ఆకాశం నీ హద్దు రా సినిమాతో సంచలన విజయం అందుకున్న సూర్య.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యారు.

Suriya 40 First Look: అదిరిపోయిన సూర్య నయా లుక్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 22, 2021 | 6:14 PM

Suriya 40 First Look: విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో సూర్య. ఇటీవలే ఆకాశం నీ హద్దు రా సినిమాతో సంచలన విజయం అందుకున్న సూర్య.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం సూర్య అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తాజా సూర్య పుట్టిన రోజు కానుకగా సూర్య 40 ‘ఎదర్కుం తునిందవన్’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉంది. డిఫరెంట్ గెటప్ లో సూర్య కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమాతో మరోసారి సూర్య భారీ హిట్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.

ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. కళానిధి మారన్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రనికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ తోపాటు తెలుగులోని విడుదల చేయనున్నారు.