Locked Season 2: మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న `ఆహా`

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సత్య దేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు.

Locked Season 2: మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న `ఆహా`
Locked
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 22, 2021 | 4:57 PM

Locked Season 2: విభిన్నకథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్‌‌‌సిరీస్‌‌‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. ఈ క్రమంలోనే మరో ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో లాక్డ్ అనే థ్రిల్లింగ్ సిరీస్‌‌‌‌లో నటించి ఆకట్టుకున్న సత్యదేవ్.. ఇప్పుడు సెకండ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం`ఆహా`లో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఈ సర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ `లాక్డ్‌` రెండో సీజ‌న్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

‘వైద్య‌శాస్త్రంలో క‌ఠిన‌త‌ర‌మైన ఎన్నో కేసుల‌కు ప‌రిష్కారాల‌ను సూచించిన గొప్ప న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఆనంద్ పాత్ర‌లో మెప్పించ‌డానికి స‌త్య‌దేవ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే అత‌ని పేరు ప్ర‌తిష్టల‌ను నాశ‌నం చేయ‌గ‌ల ఓ ర‌హ‌స్యాన్ని ఈ ప్ర‌పంచానికి తెలియ‌కుండా దాచేస్తాడు’. `లాక్డ్‌` సీజ‌న్ 1ను డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ దేవ కుమార్ సీజ‌న్‌2ను కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ లాక్డ్ సీజ‌న్ 2లో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసే అంశాలెన్నో ఉండనున్నాయి. `లాక్డ్‌` సీజ‌న్ 1లో చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసే ముగ్గురు దొంగ‌లు డాక్ట‌ర్ ఆనంద్ ఇంట్లోకి ప్ర‌వేశిస్తారు. అక్క‌డ వారికి ఆనంద్ జీవితంలోని చీక‌టి కోణం గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లోకి ప్ర‌వేశించే ఎంతో మంది నిమిషాల్లో హ‌త‌మ‌వుతుంటారు.

స‌త్య‌దేవ్‌, సంయుక్తా హెగ్డే, కేశ‌వ్ దీప‌క్‌, శ్రీల‌క్ష్మి, బిందు చంద్ర‌మౌళి త‌దిత‌రులు న‌టించిన తొలి సీజ‌న్ ప‌లు ట్విస్టులు, ట‌ర్న్స్‌తో ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌త‌కు లోన‌య్యారు. ఇప్పుడు కథ ప‌రంగా, స్కేల్‌, విజ‌న్ ప‌రంగానే కాకుండా`లాక్డ్` రెండో సీజ‌న్ వెన్నులో ఓ భ‌యాన్ని క‌లిగించేంత ఎలిమెంట్స్‌తో తెలుగు మాధ్య‌మాల్లో మేకింగ్ స్టాండ‌ర్స్ ప‌రంగానూ స‌రికొత్త అర్థాన్ని చెప్పేలా ఉండ‌బోతుందని తెలుస్తుంది. ఈ ఆసక్తికర సిరీస్ ను తెలుగు మాధ్యమం ఆహా వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

వైరల్ అవుతున్న వనితా విజయ్‌‌‌‌కుమార్ ఫోటో.. మూడు పెళ్లిళ్లు పెటాకులైన తర్వాత ఇప్పుడు నాలుగో పెళ్లా..?

Aha: మరిన్ని ఇంట్రస్టింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్న ఆహా.. అవేంటంటే

Shilpa Shetty : శాలువాలు అమ్ముకునే రాజ్‌‌‌కుంద్రా.. బాలీవుడ్ బ్యూటీ శిల్పాను ఎలా వలలో వేసుకున్నాడో తెలుసా..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు