Nayanthara: ఓటీటీలోకి లేడీ సూపర్ స్టార్ నయన్ సినిమా.. డిస్నీ హాట్‌స్టార్‌లో ‘నెట్రిక్కన్’..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్, విడుదలలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో భారీ చిత్రాలను నిర్మించిన మేకర్స్..

Nayanthara: ఓటీటీలోకి లేడీ సూపర్ స్టార్ నయన్ సినిమా.. డిస్నీ హాట్‌స్టార్‌లో 'నెట్రిక్కన్'..
Netrikann
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2021 | 8:26 AM

కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్, విడుదలలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో భారీ చిత్రాలను నిర్మించిన మేకర్స్.. సందేహంలో పడ్డారు. తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంత ముఖ్యంగా.. ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడం కూడా అంతే ముఖ్యం కావడంతో.. సినిమా విడుదల విషయంలో నిర్మాతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త కొత్త కంటెంట్.. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ.. సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతున్నాయి ఓటీటీ సంస్థలు. దీంతో తమ చిత్రాలకు ఓటీటీ నుంచి మంచి ధర వస్తే..అక్కడే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. తాజాగా మరో మూవీ ఓటీటీ బాట పట్టింది.

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ నెట్రిక్కన్ (మూడో కన్ను) ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ పామ్ డిస్నీ హాట్ స్టార్‏లో విడుదల కానుంది. ఈ విషయాన్ని డిస్నీ హాట్ స్టార్ అఫీషియల్‏గా ప్రకటించింది. కానీ రిలీజ్ ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. ఈ చిత్రానికి మిలింద్‌ రావ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రోడ్డు ప్రమాదంలో చూపు కోల్పోయే యువతి పాత్రలో నయనతార కనిపించనుంది. కొరియన్‌ థ్రిల్లర్‌ ‘బ్లైండ్‌’ చిత్రానికి ‘నెట్రిక్కన్‌’ రీమేక్‌ అనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే నయన్ చిత్రాలు ఓటీటీలలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మూవీని కూడా ఓటీటీలో విడుదల కానుంది. ఇక ప్రస్తుతం నయన్.. తెలుగుతోపాటు.. తమిళం.. హిందీ భాషలలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ట్వీట్..

Also Read: Karthika Deepam Latest: ఎమోషనల్ ట్విస్ట్..మూడంకెలు లెక్కపెట్టిన మోనిత.. కార్తీక్ ను అసహ్యించుకుంటున్న తండ్రి..సర్ది చేప్పే ప్రయత్నంలో వంటలక్క!

Sonam Kapoor: ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు అలా ఫుల్‌స్టాప్ పెట్టిన టాప్ హీరోయిన్.. అసలు విషయం ఇదే అంటూ..

Rakul Preet Singh: హెల్ప్ చేయాలంటూ రకుల్ ఆర్తనాదాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..