Rakul Preet Singh: హెల్ప్ చేయాలంటూ రకుల్ ఆర్తనాదాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్‏గా

Rakul Preet Singh: హెల్ప్ చేయాలంటూ రకుల్ ఆర్తనాదాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Rakul
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2021 | 7:18 AM

రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్‏గా కొనసాగింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్. ఇటు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. బీటౌన్‏లో ఫుల్ బిజీగా ఉంది. అటు సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ఫోటోలను.. తన సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల తన వెరైటీ ఫోటోలను షేర్ చేసి.. ట్రోలింగ్‏కు గురయ్యింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రకుల్‏కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం బాలీవుడ్‏లో చేతి నిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంది రకుల్. స్టార్ హీరో అజయ్ దేవ్‏గణ్‏తో రెండు సినిమాలు చేస్తుండగా.. ఇతర హీరోలతోనూ నటిస్తోంది. అయితే తాజాగా రకుల్ అటాక్ సినిమా కోసం డబ్బింగ్‏ను స్టార్ట్ చేసింది. అందులో రకుల్ డబ్బింగ్ స్టూడియోలో నిల్చోని ఏడుస్తూ.. హెల్ప్ మీ అంటూ అరుస్తూ కనిపిస్తుంది. తనను ఎవరో కట్టిపడేసినట్టు, ప్రమాదంలో చిక్కున్నట్టు కనిపిస్తోంది. తాను ఆపదలో ఉండటంతో.. కాపాడమంటూ రకుల్ అరుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రకుల్ ఇన్‏స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. అరవకండి.. డబ్బింగ్ సన్నివేశం జరుగుతుంది అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read: Varun Sandesh: ఉదయ్ కిరణ్, తరుణ్‏లతో నన్ను పోల్చొద్దు.. హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్..

Allu Arjun: దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌పై సందడి చేసిన బన్నీ ఫ్యామిలీ.. భార్య, చిన్నారులతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌..

Raj Kundra Arrest: పేదరికం నుంచి వచ్చాను.. నేను డబ్బును లెక్కలేకుండా ఖర్చు పెడతాను..  వైరల్ గా మారిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యాఖ్యలు