Allu Arjun: దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌పై సందడి చేసిన బన్నీ ఫ్యామిలీ.. భార్య, చిన్నారులతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌..

Allu Arjun: వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయించే వారిలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఒకరు. సినిమా చిత్రీకరణలో ఏ మాత్రం విరామం దొరికినా కుటుంబంతో సరదగా గడుపుతుంటారు బన్నీ. అయితే...

Allu Arjun: దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌పై సందడి చేసిన బన్నీ ఫ్యామిలీ.. భార్య, చిన్నారులతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌..
Allu Arjun Long Drive
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2021 | 5:50 AM

Allu Arjun: వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయించే వారిలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఒకరు. సినిమా చిత్రీకరణలో ఏ మాత్రం విరామం దొరికినా కుటుంబంతో సరదగా గడుపుతుంటారు బన్నీ. అయితే ఎక్కువగా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపించే అల్లు అర్జున్‌ తాజాగా మాత్రం హైదరాబాద్‌లో సందడి చేశారు. ఓవైపు కరోనా భయం, మరో వైపు వర్షాలు కురుస్తాయన్న కారణంతోనేమో కుటుంబంతో కలిసి నగర వీధుల్లో హల్చల్‌ చేశారు.

భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి బన్నీ లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లారు. ఇందులో భాగంగానే తాజాగా హైదారాబాద్‌లోని దుర్గం చెరువుపై ఉన్న హాంగింగ్‌ బ్రిడ్జ్‌పై కారులో వెళ్లారు. బన్నీ స్వయంగా కారును డ్రైవ్‌ చేయడం విశేషం. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియోను స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. మై సిటీ అనే క్యాప్షన్‌తో పాటు హైదరాబాద్‌, లాంగ్‌ డ్రైవ్‌, వర్షాకాలం అనే హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించారు. ఇదిలా ఉంటే బన్నీ ఓ వైపు సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంటుంటే ఆయన వైఫ్‌ స్నేహ కూడా సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం స్నేహకు 4.4 మిలియన్ల ఫాలోవర్లు ఉండడం విశేషం. టాలీవుడ్‌ హీరోల భార్యలలో ఎక్కువగా ఫాలోవర్లు ఉన్న వారిలో స్నేహ ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నారు.

Also Read: Raj Kundra Arrest: పేదరికం నుంచి వచ్చాను.. నేను డబ్బును లెక్కలేకుండా ఖర్చు పెడతాను..  వైరల్ గా మారిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యాఖ్యలు 

Nivetha Pethuraj: ఈ బ్యూటీకి రేస్ ట్రాక్ పై రయ్యిమంటూ దూసుకుపోవడం అంటే చాలా ఇష్టమట

Vishnu Manchu: బాలయ్య అయితే నాకు ఓకే.. మా ఎన్నికలపై మంచు విష్ణు కామెంట్..