Vishnu Manchu: బాలయ్య అయితే నాకు ఓకే.. మా ఎన్నికలపై మంచు విష్ణు కామెంట్..

మా ఎన్నికలు వేడి రోజు రోజుకు ఎక్కువవుతుంది. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేయబోతున్నట్టు ఇప్పటి వరకు ఐదుగురు సభ్యులు ప్రకటించారు.

Vishnu Manchu: బాలయ్య అయితే నాకు ఓకే.. మా ఎన్నికలపై మంచు విష్ణు కామెంట్..
Vishnu

Vishnu Manchu: మా ఎన్నికలు వేడి రోజు రోజుకు ఎక్కువవుతుంది. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేయబోతున్నట్టు ఇప్పటి వరకు ఐదుగురు సభ్యులు ప్రకటించారు. మా ఎన్నికల్లో తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకాశ్ రాజ్ చేసిన ప్రకటన పెను సంచలనానికి గురి చేసింది. ప్రకాశ్ రాజ్ కు పోటీగా తాము పోటీ చేస్తామంటూ జీవిత.. మంచు విష్ణు.. ఇలా పలువురు తెర మీదకు రావటంతో ఇండస్ట్రీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అప్పటినుంచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా నటసింహ బాలయ్య కూడా మా  వివాదం పై తనదైన శైలిలో స్పందించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకు ముందు మంచు విష్ణు ఓ వీడియోని విడుదల చేస్తూ.. ‘మా’ బిల్డింగ్ ను కట్టేందుకు డబ్బులు ఇస్తానని అన్నారు.. ఒకవేళ పెద్దలంతా కలిసి ఒకరిని ఎన్నికను ఏకగ్రీవం చేయాలని నిర్ణయిస్తే తప్పుకుంటానని ప్రకటించాడు.

అలాగే తాజాగా విష్ణు మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ ‘మా’ అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని చెప్పారు. అలాగే బాలయ్యతో పాటు ఆయన జనరేషన్ కి చెందిన కొందరు నటీనటులు ‘మా’ ఎన్నికల్లో నిలబడలేదని, వారిలో ఎవరు అధ్యక్షుడు అయినా తనకు అభ్యంతరం లేదని అన్నాడు, తనకు సోదరుడి లాంటి వ్యక్తి అయిన బాలయ్య అధ్యక్షుడు అయితే తనకు ఇంకా సంతోషమని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: మహేష్ అభిమానులకు పండగే.. సూపర్ స్టార్ బర్త్ డే కు డబుల్ ట్రీట్..

Family Drama Trailer: సీరియల్ కిల్లర్ గా సుహాస్.. ఆకట్టుకుంటున్న ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ట్రైలర్

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య సినిమాల లైనప్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్