Srikanth Addala: మరోసారి మల్టిస్టారర్‌పై శ్రీకాంత్ అడ్డాల గురి.. ప్రొడ్యూసర్ రెడీ

టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ ను రూపొందించిన శ్రీకాంత్ అడ్డాల..

Srikanth Addala: మరోసారి మల్టిస్టారర్‌పై శ్రీకాంత్ అడ్డాల గురి.. ప్రొడ్యూసర్ రెడీ
Venky Kamal

టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ ను రూపొందించిన శ్రీకాంత్ అడ్డాల.. ఈ సారి ఇద్దరు సీనియర్ హీరోలను సింగిల్ ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. చాలా రోజులుగా ఉన్న ప్రపోజలే అయినా… ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పనుల్లో స్పీడు పెంచారన్నది సౌత్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. నారప్ప సినిమాతో బౌన్స్ బ్యాక్‌ అయిన శ్రీకాంత్ అడ్డాల… ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నారు. అందుకే గతంలో అనుకున్న వెంకీ, కమల్‌ హాసన్‌ల మల్టీ స్టారర్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈనాడు సినిమాలో కమల్‌, వెంకీ కలిసి నటించారు. సో మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ అవుతుండటం మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది.

సీతమ్మ వాకిట్లో సినిమా తరువాత ఈ కాంబినేషన్‌ సెట్‌ చేసేందుకు ట్రై చేశారు శ్రీకాంత్‌.. ఎందుకోగాని అప్పట్లో ఈ కాంబినేషన్‌ కుదర్లేదు. కానీ ఈసారి మాత్రం సీరియస్‌గానే ట్రయల్స్ మొదలు పెట్టారట. హీరోలు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం.. ప్రొడ్యూసర్‌ కూడా రెడీ అంటున్నారు శ్రీకాంత్.. మరి ఈ సారైనా ఈ క్రేజీ కాంబినేషన్‌ ఆడియన్స్‌ ముందుకు వస్తుందేమో చూడాలి.

Also Read: తాగిన మైకంలో పొంగిపొర్లుతున్న వాగు మధ్యలో డ్యాన్స్… చివరికి ఏం జరిగిందో మీరే చూడండి

 కర్నూలు జిల్లాలో పాల వ్యాను బోల్తా.. జనాలు చూడండి ఎలా ఎగబడి వచ్చారో