Telangana Rains: తాగిన మైకంలో పొంగిపొర్లుతున్న వాగు మధ్యలో డ్యాన్స్… చివరికి ఏం జరిగిందో మీరే చూడండి
నాన్‌స్టాప్ వర్షాలతో తెలంగాణ నీళ్లలో నానుతుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నుర్ మండలం ఉమ్రీ వాగు బ్రిడ్జిపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో తాగిన మైకంలో...
నాన్‌స్టాప్ వర్షాలతో తెలంగాణ నీళ్లలో నానుతుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నుర్ మండలం ఉమ్రీ వాగు బ్రిడ్జిపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో తాగిన మైకంలో ఓ వ్యక్తి చిందులు వేస్తూ వాగును దాటబోయాడు. వరద ఉధృతికి తట్టుకోలేక నీటిలో కొట్టుకుపోయాడు. అతడి కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. కాగా ఆ వ్యక్తి వాగులో కొట్టుకుపోతున్న దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరలయ్యాయి.
నిర్మల్ జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో మాట్లాడారు సీఎం కేసీఆర్. జిల్లాలో వరద పరిస్థితిపై.. ఆరాతీశారు. అలాగే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద బాధితులకు అండగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుండుగూడెం దగ్గర ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉండడానికి గూడు కూడా లేదని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అటు భైంసా ముంపులో చిక్కుకుంది. గడ్డెన్నవాగు గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు టౌన్‌ను ముంచెత్తింది. ముఖ్యంగా ఆటోనగర్ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా మారింది. అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతుండడంతో.. భైంసాలోని ఆటోనగర్‌వాసులు కనీసం ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. 60 మంది వరకు చిక్కుకుపోయారు. బాసరకు చెందిన 12 మంది గజ ఈతగాళ్లు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని వరద బాధితులను రక్షించారు. రెండు నాటు పడవల్లో 4 గంటలు శ్రమించి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read:కర్నూలు జిల్లాలో పాల వ్యాను బోల్తా.. జనాలు చూడండి ఎలా ఎగబడి వచ్చారో