AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,843 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 70,727 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,843 మందికి వైరస్ సోకినట్లు..

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,843 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
Ap Corona
Follow us

|

Updated on: Jul 22, 2021 | 5:54 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 70,727 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,843 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1948592కు చేరింది. మరో 12 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13209కు పెరిగింది. కొత్తగా 2,199 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,11,812కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,39,09,363 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో  23571 యాక్టివ్ కేసులున్నాయి.

కోవిడ్ వల్ల కొత్తగా ప్రకాశం జిల్లాలో ముగ్గురు, చిత్తూర్ జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, కర్నూల్ జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు,  కృష్ణా  జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు.

జిల్లాలవారీగా కేసుల వివరాలు దిగువన చూడండి…

దేశంలో కరోనా వివరాలు…

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.  కొత్తగా 24 గంటల వ్వవధిలో దేశవ్యాప్తంగా 17.18లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 41,383 మందికి పాజిటివ్‌గా తేలింది. కేరళ, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లకు చేరింది. ఇక ఇదే సమయంలో 38,652 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3.04కోట్లకు చేరగా… రికవరీ రేటు 97.35శాతంగా ఉంది. ఇక 24 గంటల వ్యవధిలో మరో 507 మందిని కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 4.18లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,09,394 మంది కరోనాతో బాధపడుతున్నారు.

Also Read: చనిపోయిన పెంపుడు కుక్కకు కాంస్య విగ్రహం, ఐదేళ్లగా వర్థంతి కార్యక్రమాలు

 కర్నూలు జిల్లాలో పాల వ్యాను బోల్తా.. జనాలు చూడండి ఎలా ఎగబడి వచ్చారో