కరోనా వైరస్ పుట్టుకపై రెండో దశ దర్యాప్తు జరగాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..కొట్టి పారేసిన చైనా
కరోనా వైరస్ పుట్టుకపై రెండో దశ దర్యాప్తు జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ప్రతిపాదిస్తుండగానే.. అబ్బే ..అక్కర్లేదంటూ చైనా తిరస్కరించింది. వైరస్ అరిజిన్ పై ఈ సెకండ్ ఫేజ్ లో ముమ్మరంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని చైనా లోని వూహాన్ ల్యాబ్, మార్కెట్ల ఆడిటింగ్...
కరోనా వైరస్ పుట్టుకపై రెండో దశ దర్యాప్తు జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ప్రతిపాదిస్తుండగానే.. అబ్బే ..అక్కర్లేదంటూ చైనా తిరస్కరించింది. వైరస్ అరిజిన్ పై ఈ సెకండ్ ఫేజ్ లో ముమ్మరంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని చైనా లోని వూహాన్ ల్యాబ్, మార్కెట్ల ఆడిటింగ్ సహా అన్ని అంశాలపైనా దీన్ని నిర్వహించడం సముచితమని ఈ సంస్థ ఈ నెల ఓ ప్రతిపాదన చేసింది. పారదర్శకత అన్నది ఉండాలని అభిప్రాయపడింది. కానీ ఈ ప్లాన్ ని తాము అంగీకరించే ప్రసక్తి లేదని..కొన్ని విషయాల్లో ఇది కామన్ సెన్స్ ని, సైన్స్ ని అతిక్రమించేదిగా ఉందని చైనాకు చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ ప్రతినిధి జెంగ్ ఇక్సిన్ అన్నారు. ఈ ప్రతిపాదన చూడబోతే..తమ దేశ లేబొరేటరీల ప్రొటొకాల్స్ ఉల్లంఘన కారణంగానే రీసెర్చ్ సందర్భంగా వైరస్ లీక్ అయిందన్న అభిప్రాయానికి ఆస్కారమిచ్చే విధంగా ఉందని ఆయన పేర్కొన్నాడు. మా చైనీస్ నిపుణులు ఇస్తున్న సూచనలు, సలహాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చురుకుగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పాడు. వైరస్ అన్నదాన్ని సైన్స్ పరంగానే చూడాలి తప్పితే ఇందులో రాజకీయ పోకడలకు తావుండరాదని జెంగ్ అన్నాడు.
2019 డిసెంబరులో వూహాన్ ల్యాబ్ లో తొలి వైరస్ కేసు బయటపడింది. కానీ మొదటి నుంచి ఇది తమ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని చైనా ఖండిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ దేశం మీదే ఊరికే దృష్టి పెట్టకుండా ఇతర దేశాలలోని ల్యాబ్ ల నుంచి వైరస్ లీక్ అయిందా అన్న విషయాన్ని కూడా ఆరా తీయాలని చైనీస్ టీమ్ లీడర్ లియాంగ్ వానియన్ అంటున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch Video: కరీంనగర్ జిల్లాతో నాకు సెంటిమెంట్ ఉంది..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.