KTR on Rains: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మాట్లాడిన కేటీఆర్ .. ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ

KTR on Rains: ఓ వైపు రుతుపవనాల ప్రభావం.. మరోవైపు బంగాళాఖాతం లో అల్పపీడనం దీంతో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిచి ముద్దవుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి..

KTR on Rains: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మాట్లాడిన కేటీఆర్  .. ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ
Ktr On Rains
Follow us

|

Updated on: Jul 22, 2021 | 6:17 PM

KTR on Rains: ఓ వైపు రుతుపవనాల ప్రభావం.. మరోవైపు బంగాళాఖాతం లో అల్పపీడనం దీంతో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిచి ముద్దవుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు.ప్రధానంగా ఉత్తర తెలంగాణ లో నెలకొన్న భారీ వర్షాల వలన ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్ వంటి చోట్ల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరుగుతున్న సహాయక చర్యలు ఆరాతీశారు. స్థానిక జిల్లా యంత్రాంగంతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మరోవైపు హైదరాబాద్ నగరం లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసి యంత్రాంగం సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో పనిచేసే డిజాస్టర్ రెస్పాన్స్ దళం సైతం అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలన్నారు. ఈ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టెంతవరకు ప్రతి ఒక్క పురపాలక శాఖ అధికారి.. ఉద్యోగి విధుల్లో ఉంటూ స్థానికంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పురపాలక శాఖ యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ సూచించారు. పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పౌరులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను కోరారు.

Also Read:   కలిసి చనిపోదాం అంటూ ప్రియురాలికి పురుగులు మందు తాగించిన ప్రియుడు.. ఆపై పారిపోయిన వైనం

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..