Mahesh Babu: మహేష్ అభిమానులకు పండగే.. సూపర్ స్టార్ బర్త్ డే కు డబుల్ ట్రీట్..

ఆగస్టు 9 మహేష్ అభిమానులకు పెద్ద పండగ.. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే ఆ రోజు. ఇక ప్రతి బర్త్ డే కు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ వస్తున్నారు మహేష్.

Mahesh Babu: మహేష్ అభిమానులకు పండగే.. సూపర్ స్టార్ బర్త్ డే కు డబుల్ ట్రీట్..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 22, 2021 | 8:29 PM

Mahesh Babu: ఆగస్టు 9 మహేష్ అభిమానులకు పెద్ద పండగ.. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే ఆ రోజు. ఇక ప్రతి బర్త్ డే కు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ వస్తున్నారు మహేష్. ఈ సారి ఆ ట్రీట్ డబుల్ అవ్వనుంది. ప్రస్తుతం మహేష్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారిపాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడింది ఈ సినిమా షూటింగ్. ఇటీవల కరోనా ప్రభావం తగ్గడంతో సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. కరోనా కంటే ముందు ఈ సినిమా కొంత భాగం షూటింగ్ దుబాయ్ లో జరిపారు చిత్రయూనిట్. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది ఈ సినిమా. అయితే ఈ సినిమా  అప్డేట్ కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మే 31న  సినిమా నుంచి ఫస్ట్ లుక్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దాంతో కొంత నిరాశకు గురైన అభిమానులు. దాంతో ఇప్పుడు మహేష్ బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. మహేష్ పుట్టినరోజు నాడు ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో మరియు ఓ పోస్టర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట ఆ చిత్రయూనిట్. అలాగే త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ కూడా అదే రోజు ఉండనుందని తెలుస్తోంది. అయితే మహేష్ పుట్టిన రోజు నాడు త్రివిక్రమ్ సినిమాను ప్రారంభించనున్నారని అంటున్నారు. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇలా మహేష్ బార్ట్ డే రోజు అభిమానులకు డబుల్ ట్రీట్ ఉండనుందని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: ట్రెండ్స్ విషయంలో ఊచకోత పక్కా అంటున్న మహేష్ ఫ్యాన్స్.. మాములు ప్లానింగ్ కాదుగా

Manchu Vishnu: “మా” బిల్డింగ్ కట్టి తీరుతాం.. మంచు విష్ణు లైవ్ ఇంటర్వ్యూ.. వీడియో

Actress Savitri: తెలుగులోనే కాదు హాలీవుడ్ సినిమాల్లో నటించిన మహానటి సావిత్రి వారసుడు.. ఎవరో తెలుసా