AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family Drama Trailer: సీరియల్ కిల్లర్ గా సుహాస్.. ఆకట్టుకుంటున్న ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ట్రైలర్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా టర్న్ అయ్యాడు సుహాస్. హీరో ఫ్రెండ్ గా చాలా సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్న సుహాస్.

Family Drama Trailer: సీరియల్ కిల్లర్ గా సుహాస్.. ఆకట్టుకుంటున్న 'ఫ్యామిలీ డ్రామా'  మూవీ ట్రైలర్
Suhas
Rajeev Rayala
|

Updated on: Jul 22, 2021 | 8:25 PM

Share

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా టర్న్ అయ్యాడు సుహాస్. హీరో ఫ్రెండ్ గా చాలా సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్న సుహాస్.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు సుహాస్. ఇప్పుడు హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. మొదటి సినిమా మంచి లవ్ స్టోరీతో వచ్చిన సుహాస్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ తో భయపెట్టడానికి సిద్దమయ్యాడు. ”ఫ్యామిలీ డ్రామా” అనే మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుహాస్. మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుహాస్ సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడు.

తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్న ఓ ఫ్యామిలీకి సహాయం చేయడానికి వచ్చిన సైకో కిల్లర్ సుహాష్.. వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. వరుస హత్యలు చేసే వ్యక్తి బారిన ఒక ఫ్యామిలీ ఎలా పడింది? ఆలస్యంగా అసలు విషయాన్ని తెలుసుకున్న వాళ్లు ఆయన బారి నుంచి తప్పుంచుకోగలిగారా..? అన్నది ఆసక్తిని కలిసాగిస్తోంది. ఛష్మా ఫిలిమ్స్ .. నూతన భారతి ఫిలిమ్స్  సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ముఖ్యమైన పాత్రలలో పూజా కిరణ్ .. శ్రుతి మెహర్ .. సంజయ్ .. తేజ కనిపించనున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య సినిమాల లైనప్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్

Shankar Mahadevan: యువ గాయని పాటకు శంకర్‌ మహదేవన్‌ ఫిదా.. ‘సోల్‌ టచింగ్’ అంటూ పోస్ట్

Mahesh Babu: ట్రెండ్స్ విషయంలో ఊచకోత పక్కా అంటున్న మహేష్ ఫ్యాన్స్.. మాములు ప్లానింగ్ కాదుగా