- Telugu News Entertainment Tollywood Nivetha pethuraj gets a formula race certificate photos goes viral
Nivetha Pethuraj: ఈ బ్యూటీకి రేస్ ట్రాక్ పై రయ్యిమంటూ దూసుకుపోవడం అంటే చాలా ఇష్టమట
నివేద పేత్ రాజ్... మెంటల్ మదిలో అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.
Updated on: Jul 22, 2021 | 9:34 PM

నివేద పేత్ రాజ్... మెంటల్ మదిలో అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.

ఇక ఈ అమ్మడి హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే ఎక్కువ ఛాన్స్ లు వచ్చాయి. మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి, అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.

ఇక ఈ అమ్మడి మరో టాలెంట్ కూడా ఉంది. అదే కార్ రేసింగ్. రేసింగ్ ట్రాక్ పై రయ్యిమంటూ దూసుకుపోవడం అంటే మహా ఇష్టమట.

తాజాగా ఈ అమ్మడు.. ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో లెవెల్ 1లో సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

మొమెంటమ్ – స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ సంస్థ నుండి నివేతా పేతురాజ్ ఈ సర్టిఫికెట్ ను పొందింది.

ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కార్ రేసర్ అవతారమెత్తిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ చిన్నది ప్రస్తుతం రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విరాట పర్వం మూవీలో కీలక పాత్ర చేస్తుంది. అలాగే తెలుగులో మూడు, నాలుగు సినిమాల్లోనూ నివేతా కనిపించబోతుంది.

నివేద పేత్ రాజ్




