AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 : బాక్సాఫీస్ సెన్సేషన్ ధురంధర్ 2.. ఇకపై తెలుగులోనూ చూడొచ్చు.. ఎలాగంటే..

ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా ధురంధర్ 2. బీటౌన్ హీరో రణవీర్ సింగ్ హీరోగా.. డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ధురంధర్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది ఈ మూవీ. ఇదిలా ఉంటే.. ఇకపై ఈ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు.

Dhurandhar 2 : బాక్సాఫీస్ సెన్సేషన్ ధురంధర్ 2.. ఇకపై తెలుగులోనూ చూడొచ్చు.. ఎలాగంటే..
Dhurandhar 2
Rajitha Chanti
|

Updated on: Mar 21, 2026 | 9:04 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ధురంధర్ 2 ది రివెంజ్. సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ వోల్టెజ్ యాక్షన్ థ్రిల్లర్ ఉగాది కానుకగా మార్చి 19న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ తో అదరగొట్టేసింది. రణవీర్ సింగ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ మేకింగ్ వాల్యూస్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ సినిమాపై ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సారా అర్జున్ కథానాయికగా నటించగా.. మాధవన్ కీలకపాత్ర పోషించారు. మరోవైపు రణవీర్ యాక్టింగ్, ఆదిత్య ధర్ మేకింగ్ కు అడియన్స్ ఫిదా అవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

అయితే ఇప్పటివరకు హిందీలో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఇకపై తెలుగులోనూ చూడొచ్చు. తెలుగు ప్రేక్షకుల నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. ఈ సినిమా ఎదుర్కొన్న సెన్సార్ సమస్యలు తొలగిపోయి శనివారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తెలుగు వెర్షన్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో తెలుగు షోలు కనిపిస్తుండడంతో పెద్ద ఎత్తున టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. దీంతో టాలీవుడ్ ఫ్యా్న్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నరు.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది ధురంధర్ 2. ఇక రెండో రోజు సైతం అదే స్థాయిలో దూసుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ విడుదల కావడంతో బాక్సాఫీస్ లెక్కలు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us